Skip to main content

స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను కొనుగోలు చేసి చేయూత అందించాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, 10 మార్చి 2026, SSN:------
       జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను కొనుగోలు చేసి చేయూత అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనుగోలుదారులకు పిలుపునిచ్చారు.
        మంగళవారం ఉదయం తాడిగడప మున్సిపాలిటీ కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో "కొనుగోలుదారులు- అమ్మకందారుల సమ్మేళనం' పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇందులో జిల్లాలో పలువురు స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసి ప్రదర్శనకు ఉంచిన వివిధ అకాల ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు, పారిశుద్ధ్య ద్రవ పదార్థాలు, ఆకు పళ్ళెములు తదితర గృహోపకరణ వస్తువులు,సామాగ్రి ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.
       ఇంజనీరింగ్ కళాశాలలోని ఆడిటోరియం లో మొత్తం 197 ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయగా, మహిళా వ్యాపారవేత్తలు కొనుగోలుదారులతో కళకళలాడింది.   
జిల్లా కలెక్టర్ ఎంతో ఓపికగా ప్రతి ప్రదర్శనశాల వద్దకు వెళ్లి మహిళలు తయారు చేసిన వస్తువుల ధరలు, తయారీకి అయ్యే ఖర్చు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, వారికి వచ్చే ఆదాయం తదితర వివరాలు, సమ్మేళనంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
       ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయం మేరకు ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలనే నినాదంతో జిల్లాలోని స్వయం సహా సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా అభివృద్ధి పరిచేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
       జిల్లాలో నిజంగా జీవితంలో పైకి ఎదగాలనే తపన, కష్టపడే మనస్తత్వం కలిగిన 500 మందిని గుర్తించామని అందులో 300 మందికి ప్రభుత్వ సహకారంతో పాటు పలు పథకాల కింద బ్యాంకు రుణాలు మంజూరు చేయించి వివిధ రకాల యూనిట్లు స్థాపించడానికి తోడ్పాటు అందించామన్నారు.
      ఇదివరకు వారు తయారు చేసిన ఉత్పత్తులు ఎక్కడ అమ్మాలో తెలియక సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతుండేవారన్నారు. వారి వ్యాపారం సుస్థిరంగా ఉండాలంటే వారికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో కొనుగోలుదారులు అమ్మకందారుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేశామన్నారు.
సమ్మేళనం ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు సమీపంలో ఎక్కడున్నాయో కొనుగోలుదారులకు తెలిసే అవకాశం లభించిందన్నారు. తక్కువ ధరలో ఉత్పత్తులు రవాణా ఖర్చులు లేకుండా వారికి లభ్యమవుతాయన్నారు.
         నాణ్యతగా ఉన్న ఆహార ఉత్పత్తులను కొనుగోలుదారులు హోటల్ యజమానులు కొనుగోలు చేయడంతో పాటు వాటి ఫోటో తీసుకుని వారికి తెలిసిన వారందరికీ షేర్ చేస్తూ కూడా విస్తృతంగా తెలియజేయాలన్నారు. నాణ్యత విషయంలో గానీ ఇతర ఏమైనా లోటుపాట్లు ఉంటే ఉత్పత్తిదారులకు సూచనలు కూడా ఇవ్వాలన్నారు. జిల్లా యంత్రాంగం పిలుపుమేరకు వచ్చిన కొనుగోలు దారులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 
          కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అమృత కృష్ణా పేరుతో ప్లాస్టిక్ ను నివారించే ఉద్దేశంతో గాజు సీసాలతో మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఎవరైనా సరే అవసరము ఉన్నవారు మంచినీటినీ కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోలుదారులను మహిళ వ్యాపారవేత్తలు సంప్రదిస్తే వారికి కావలసిన సహకారం అందించాలన్నారు. 
      పెద్ద పెద్ద కొనుగోలుదారుల నుండి ఏమైనా ఆర్డర్లు వస్తే మహిళా వ్యాపారవేత్తలు వారి శక్తి సామర్థ్యాలకు మించకుండా నాణ్యత లోపం లేకుండా ఉత్పత్తులు సరఫరా చేయాలన్నారు. చెప్పిన సమయానికి నాణ్యత గల ఉత్పత్తులు సరఫరా చేసే విధంగా మహిళా వ్యాపారవేత్తలు సిద్ధంగా ఉండాలన్నారు
         అనంతరం ఆంధ్ర ప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి మాట్లాడుతూ హోటల్ యజమానులు అందరూ ఐకమత్యంగా ఉంటామన్నారు. జిల్లా కలెక్టర్ తొలిసారిగా ఇటువంటి సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. మహిళా వ్యాపారవేత్తలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
         జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రమణ మాట్లాడుతూ హోటల్లలో ఉలవచారు తప్పకుండా వాడతామని సమ్మేళనంలో ఉంచిన ఉలవచారు కూడా గమనించి కొనుగోలు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకునీ కొనుగోలుదారులకు అమ్మకందారులకు ప్రత్యేకంగా సమ్మేళనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే నినాదానికి తమ వంతు సహకారం తప్పకుండా అందిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ కోరిన మీదట తమకు కావలసిన మంచినీటి సీసాలను కృష్ణ కలెక్టరేట్ నుండి కొనుగోలు చేస్తామన్నారు. 
         వాణి స్వీట్స్ అధినేత క్యాటరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు దిలీప్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం రూపొందించిన వివిధ ఉత్పత్తుల ధరల కేటలాగు చాలా బాగుందని ఏదైనా ఒక యాప్ ద్వారా డిజిటల్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యతగా ఉంటే తాము కొనుగోలు చేస్తామని ఆ నాణ్యత నిరంతరం కొనసాగాలన్నారు. 
         జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జిబివి రవికుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సమ్మేళనం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం అన్నారు. తమ సంఘం భవనంలో కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలని చక్కగా వ్యాపారం జరుగుతుందని చెప్పారు. 
       అనంతరం మహిళా వ్యాపారవేత్తలు సత్యవతి, సుష్మ తాము ఎలా వ్యాపారం మొదలు పెట్టి అభివృద్ధి చేశాము మిఠాయిలు ,తినుబండారాలు, ఎంబ్రాయిడరీ, చేనేత వస్త్రాలు గురించి వివరించారు.
        ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ కల్పన, డిఆర్ఓ చంద్రశేఖర రావు, ఉయ్యూరు ఇన్చార్జ్ ఆర్డిఓ కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, డి ఆర్ డి ఏ పి డి హరిహరనాథ్, డి ఐ సి జి ఎం వెంకటరావు జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు,, మార్కెటింగ్ ఎడి నిత్యానందం, డి టి డబ్ల్యూ ఫణి ధూర్జటి, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, జిల్లా ఉద్యాన అధికారి జే.జ్యోతి, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, ఆహార తనిఖీ అధికారి గోపాలకృష్ణ, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్, సంయుక్త కార్యదర్శి ఈమని దామోదర్ రావు పలువురు పారిశ్రామికవేత్తలు కొనుగోలుదారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...