వ్యక్తిని చితక్కొట్టి కసి తీరక పచ్చిమిరపకాయ్ వెల్లుల్లి నూరి ప్రైవేట్ పార్టు లో పెట్టి చిత్రహింసలు
మచిలీపట్నం :
మంగళవారం నగరంలోని పోతేపల్లి జ్యువెలరీ పార్క్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఉషా గోల్డ్ కవరింగ్ యజమాని మానవత్వం మరిచి ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. రవి అనే గుమస్తా పై దొంగతనం అభియోగం మోపి చితకొట్టి కసి తీరక శాడిస్ట్ గా మారిన యజమాని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు నూరి ప్రైవేట్ పార్ట్ లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారని బాధితులు ఆరోపించారు.
బాధితుడు రవి మీడియాతో మాట్లాడుతూ వర్కర్ శ్రావణి అనే మహిళతో యజమాని అక్రమ సంబంధం బయట పడుతుందనే భయంతో తనపై దాడికి పాల్పడ్డారన్నారు. కాళ్లు, చేతులు పట్టుకొని గదిలో బట్టలు ఊడదీసి అనంతరం కసి తీరక యజమాని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు నూరి కొట్టిన భాగంలో ప్రైవేట్ భాగాలలో పెట్టారని అన్నారు. బాధితుడు భార్య, భర్తకు జరిగిన ఘటననూ వివరిస్తూ కన్నీటి పర్యంతం అయింది. దొంగతనం చేస్తే పోలీసు కేసు పెట్టి చట్టపరంగా శిక్షించాలని, అంతేకానీ ఈ విధంగా అమానుషంగా ప్రవర్తించడం సరికాదని అన్నారు. బలవంతంగా చిత్రహింసలకు గురిచేసి ఫోన్, ద్విచక్ర వాహనాన్ని లాక్కోవడమే కాక తెల్ల కాగితంపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. తీవ్ర గాయాలైన భర్తను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సంబంధిత ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment