Skip to main content

కేడీసీసీ అభివృద్ధిలో సొసైటీ చైర్మన్‌ల పాత్ర కీలకం– కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్

విజయవాడ:
       నగరంలోని మాకినేని బసవ పున్నయ్య ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన ఉమ్మడి కృష్ణా జిల్లా సొసైటీ చైర్మన్‌ల మహాజనసభలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం పాల్గొని ప్రసంగించారు.
      ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంక్ అభివృద్ధిలో సొసైటీ చైర్మన్‌లు, సభ్య సంఘాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన సహకార బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
       జిల్లాల వారీగా బ్యాంక్ ప్రస్తుత స్థితిని వివరించిన ఆయన కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం పనితీరు పరంగా కేడీసీసీ బ్యాంక్ 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వంటి ప్రధాన వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుతూ ఈ స్థానం సాధించడం గర్వకారణమని అన్నారు. గతంలో 3వ స్థానంలో ఉన్నప్పటికీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విలీనాల తరువాత పోటీ పెరగడంతో ర్యాంకింగ్‌లో మార్పు వచ్చినట్లు పేర్కొన్నారు.
       అయితే, సహకార బ్యాంకింగ్ రంగంలో కేడీసీసీ బ్యాంక్ రాష్ట్రవ్యాప్తంగా 1వ స్థానంలో, దేశవ్యాప్తంగా 4వ స్థానంలో నిలిచిన విషయాన్ని ఆయన గర్వంగా వెల్లడించారు. ఇది బ్యాంక్ సిబ్బంది, మేనేజ్‌మెంట్, సభ్య సంఘాల సమిష్టి కృషికి నిదర్శనమని అన్నారు. రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన కేడీసీసీ బ్యాంక్, జనతా ఇన్సూరెన్స్ పథకం ద్వారా రైతులకు భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుందని చెప్పారు. అదేవిధంగా, ఆ రైతు తీసుకున్న పంట రుణంపై ఉన్న వడ్డీ మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేసి, కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్నామని వెల్లడించారు.
        పిఎసియస్  సభ్యులకు అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.10,000 సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం విద్యా రుణాలు, గృహ రుణాలు, వ్యవసాయ భూమి కొనుగోలు రుణాలు వంటి పలు రుణ సదుపాయాలను అందిస్తున్నామని చెప్పారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించే దిశగా ఆర్ టి జి ఎస్, ఎన్ ఈ ఎఫ్ టి, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు క్యూ ఆర్ కోడ్ సౌకర్యాలను కూడా అందిస్తున్నామని వివరించారు.

మహాజనసభలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు:
రైతులకు ఉపశమనంగా ₹182.31 లక్షల వడ్డీ మాఫీకి ఆమోదం
2026–27 ఆర్థిక సంవత్సరానికి ₹115.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
 బంటుమిల్లి PACS, సేరి లక్ష్మీపురం PACS నుండి స్థలాల కొనుగోలు చేసి బ్రాంచ్ భవనాల నిర్మాణానికి ఆమోదం
 వెల్లటూరు, రెడిగూడెం (ఎన్టీఆర్ జిల్లా), సేరి లక్ష్మీపురం (కృష్ణా జిల్లా) ప్రాంతాల్లో 3 కొత్త బ్రాంచ్‌ల ప్రారంభానికి ఆమోదం

      ఈ సందర్భంగా ఉద్యోగులందరూ తమ బాధ్యతలను జవాబుదారీతనంతో నిర్వర్తించాలని, రైతులకు నాణ్యమైన సేవలందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడరాదని సూచించారు. సొసైటీ అధ్యక్షులు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా చైర్మన్ నెట్టెం రఘురాం  విజ్ఞప్తి చేశారు. సభ్యుల సహకారం, సమర్థవంతమైన వ్యూహాలు, సేవా భావంతో కేడీసీసీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటుందని చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
         ఈ సందర్భంగా ఇటీవల మరణించిన నవాబుపేట సొసైటీ చైర్మన్ చింతా వెంకటేశ్వరరావు కి సభ సంతాపాన్ని తెలియజేసింది.
        2026–27 సంవత్సరానికి మేనేజర్ స్థాయి నుంచి ఏజీఎం స్థాయి వరకు ఉద్యోగుల వేతన సవరణలో తన అమూల్యమైన సహకారం అందించిన చైర్మన్ కు ఉద్యోగ సంఘ నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అక్కినేని రాజా, సంబదువ రావు, వాసవి కుమారి, పెర్నీ సురేష్, సోమయ్య, ఎన్. శ్రీనివాసరావు తదితర నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం పట్ల ఆయన చూపిన చిత్తశుద్ధి, పట్టుదల ప్రశంసనీయం అని కొనియాడారు. ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుపర్చే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో సేవలు అందించడానికి దోహద పడుతుందని వారు పేర్కొన్నారు.
          ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ్ మనోహర్,  డిసిఓ చంద్రశేఖర్ రెడ్డి, జిఎంలు రంగబాబు, చంద్రశేఖర్, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన సొసైటీ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...