మచిలీపట్నం :
కృష్ణా విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న లా పరీక్షల కేంద్రాన్ని కృష్ణా విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె. రాంజీ తనిఖీ చేశారు. బుధవారం ప్రారంభమైన లా మొదటి, ఐదవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి కృష్ణా విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాలలో పరీక్షా కేంద్రం ను ఏర్పాటు చేశారు.
మచిలీపట్నం దైత శ్రీరాములు హిందూ లా
కళాశాలకు చెందిన నా 150 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య కె. రాంజీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి ఏర్పాట్ల ను పరిశీలించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు ఆధ్వర్యములో విద్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రాజకీయ నాయకులు, విద్యాధికులు లా పరీక్షల కు హాజరుకావడం గమనార్హం.
Comments
Post a Comment