Skip to main content

టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం

మచిలీపట్నం, 9 మార్చి 2026, SSN:
        మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రానున్న రోజుల్లో జరిగే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కొల్లు రవీంద్ర పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అధికారాన్ని కోల్పోయిన వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజల్లోకి వెళ్లి సమర్థంగా ఎదుర్కోవాలని, సోషల్ మీడియాలో జరుగుతున్న అపప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని మంత్రి సూచించారు. ప్రజలకు నిజాలను తెలియజేసేలా పార్టీ నాయకులు చురుకుగా పని చేయాలని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో డ్రైనేజ్, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. అదేవిధంగా పార్టీ ఇంచార్జీలు గ్రామాలు, వార్డుల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్–6 హామీలు, సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రి కొల్లు రవీంద్ర దిశానిర్దేశం చేశారు.
ఇకపోతే టౌన్, రూరల్ అనుబంధ సంఘాల నియామకాలు, అంతర్గతంగా కేఎస్‌ఎస్‌ల నియామకం తదితర పార్టీ వ్యవహారాలపై కూడా సమావేశంలో చర్చించారు. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు (బుల్లయ్య), జిల్లా పార్టీ కార్యదర్శి గోపు సత్యనారాయణ, మార్కెటింగ్ యాడ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, కార్పొరేటర్లు మరకాని సమతా కీర్తి, దేవరపల్లి అనిత, దింతకుర్తి సుధాకర్, అన్నం ఆనంద్, చిత్తజల్లు నాగరాము, పార్టీ నాయకులు, క్లస్టర్ ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...