Skip to main content

మాతా శిశు మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం :

జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో మాతా శిశు మరణాలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి ముగ్గురు తల్లుల మరణాలపై శస్త చికిత్సలు చేసిన డాక్టర్లు, బాధితుల బంధువులతో సమీక్షించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏ తల్లి జన్మనిస్తూ మరణించరాదని, అలాగే ఏ బిడ్డ జన్మిస్తూ మరణించరాదని స్పష్టం చేశారు. ఎలమర్రు గ్రామానికి చెందిన కొల్లూరు స్వరూప రాణికి గుడివాడ ప్రాంతీయ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం అయ్యాక, ఆమెను అక్కడి డాక్టర్లు విజయవాడ సర్వజన ఆసుపత్రికి తీసుకుపోవాలని సూచించినప్పటికీ 108 అత్యవసర వాహన సిబ్బంది అలా తీసుకొని పోకుండా మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందన్నారు. ఆ విధంగా ఎందుకు చేశారని కలెక్టర్ ప్రశ్నించగా 108 అత్యవసర వాహనం ఇన్చార్జి స్టీఫెన్ మాట్లాడుతూ వారి నిబంధనల ప్రకారం దగ్గర ఉన్న మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని వివరించారు.
దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సరైన డాక్టర్లు, మందులు, పరికరాలు అందుబాటులో ఉండే ఆసుపత్రికి తీసుకొని వెళ్లే విధంగా రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వానికి ఈ విషయమై సమగ్ర నివేదిక సిద్ధం చేసి పంపాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి సూచించారు. 

మిగిలిన రెండు కేసులు ఒకటి పెద్ద అవుటుపల్లికి చెందినది కాగా రెండవది మచిలీపట్నం నగరంలోని బాలాజీ నగర్ కు చెందినదని, ఈ రెండు కేసులు హై రిస్క్ తో కూడినవని పిల్లల్ని కనకూడదు, గర్భం దాల్చకూడదు అని చెప్పినప్పటికీ వారు గర్భం ధరించడం వలన సమస్య ఏర్పడిందని డిఎంహెచ్ఓ కలెక్టర్కు వివరించారు. 

దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకోసం మహిళలు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేసి గర్భం దాల్చకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు శస్త్ర చికిత్సలు చేశాక ప్రసవానంతరం తల్లి బిడ్డ సురక్షితంగా ఉండాలని, ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలని కలెక్టర్ హెచ్చరించారు. 

ఈ సమావేశంలో డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, డి ఐ ఓ డాక్టర్ ప్రేమ్ చంద్, జి జి హెచ్ పర్యవేక్షకులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్లు స్వరాజ్యలక్ష్మి, అనురాధ, శ్రీనివాసు, జ్ఞాన కుమారి, స్వచ్ఛంద సభ్యులు సుశీల, ఏఎన్ఎంలు, ఆశా అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...