మచిలీపట్నం :
కృష్ణా యూనివర్సిటీ విద్యా సంవత్సరం 2015-16,
2016-17, 2017-18, 2018-19, 2019-20, 2020-21 సంబంధించిన విద్యార్థులకు యూజీ సెమిస్టర్ “వన్ టైమ్ ఆపర్చునిటీ" అవకాశం కల్పిస్తున్నట్లు కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్. ఉషా, పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి ఒక ప్రకటనలో తెలిపారు.
దీనికి సంబంధించిన షెడ్యూల్ మే 2026 విడుదల చేసినట్లు, పరీక్షలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు జరిమానా లేకుండా చివరి తేదీ 16 ఏప్రిల్ 2026 అనీ, పరీక్షలు 20 మే 2026 నుండి ప్రారంభమవుతాయని తెలిపారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోపు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించవలసిందిగా ప్రకటనలో కోరారు.
Comments
Post a Comment