Skip to main content

ముస్లిం ఉద్యోగులను ఒక గంట ముందే వెళ్లేందుకు అనుమతించాలి.... జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం :

      పవిత్ర రంజాన్ పర్వదినం పురస్కరించుకొని జిల్లాలోని ముస్లిం లు ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా వారు నివసించే ప్రాంతాలు, మసీదులు ప్రార్థన మందిరాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మంచినీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
 
          జిల్లా కలెక్టర్ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై వివిధ శాఖల జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారు నివసించే ప్రాంతాల్లోనూ మసీదులు, ప్రార్థన మందిరాలలో వద్ద మంచినీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించాలన్నారు. 

మసీదులు, ప్రార్థన మందిరాలు, ఈద్గాల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలలో పనిచేసే కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు ముస్లిం ఉద్యోగులు అందరూ పవిత్ర రంజాన్ మాసంలో నమాజ్ చేయుటకు వీలుగా ఈనెల 19వ తేదీ వరకు అన్ని పని దినాలలో ముగింపు సమయానికి ఒక గంట ముందుగా సంబంధిత కార్యాలయము లేదా పాఠశాలను వదిలి వెళ్ళుటకు ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ వివరించారు.

ముస్లింల సౌకర్యం కోసం రాత్రులు అంగళ్ళు, కూరగాయల మార్కెట్లు, హోటల్లు తెరిచి ఉంచేలా పోలీసులు అనుమతించాలని కలెక్టర్ సూచించారు. 

ఈ జూమ్ సమావేశంలో , జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రబ్బాని, మచిలీపట్నం, గుడివాడ ఉయ్యూరు ఆర్డీవోలు సాంబశివరావు,,బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, డిఎస్ఓ మోహన్ బాబు, జెడ్పిసిఈఓ కన్నమ నాయుడు, డిపిఓ అరుణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, కార్మిక శాఖ అధికారి విష్ణు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏసు రత్నం, డిఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...