Skip to main content

అందరికీ ఆదర్శం ఈ ఉపాధ్యాయులు.!

ఇది కదా "ఆదర్శం" అంటే..!

ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ప్రయోజకులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు!
మచిలీపట్నం :

         ఎవరి పిల్లలైనా, వారు ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానంలోకి ఎదగాలని కోరుకోవడం సహజం. కూలీ పిల్లలైన, కోటీశ్వరుల పిల్లలైనా వారి బిడ్డలకు విద్యే పునాది. ప్రస్తుత రోజుల్లో కూలి పనులు చేసుకుంటూ కూడా తమ బిడ్డల్ని కాన్వెంట్లకు పంపుతూ... వారు ఉన్నత స్థానానికి ఎదగాలని ఆశించే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చకుండా ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపిస్తున్నారు. నిరుపేదలైన వారు కూడా తమ పిల్లలు ఉన్నత స్థితికి ఎదగాలనే భ్రమలో వేలకు వేలు కాన్వెంట్ ఫీజులకు ధారపోస్తున్నారు. ఇంగ్లీషు భాష పట్ల మక్కువతో, ''మమ్మీ" "డాడీ" కల్చర్ కి పట్టం కడుతున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో తమ బిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చి, వారు ఉన్నత స్థితికి ఎదిగేలాగా ప్రోత్సాహాన్ని అందించిన ఈ తల్లిదండ్రులు అభినందనీయులు. 
 
 భార్యాభర్తలిరువురు  ప్రభుత్వ ఉపాధ్యాయులే
        ఈ భార్యాభర్తలు ఇరువురూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులే. దాదాపు 30 సంవత్సరాలకి పైగా ప్రభుత్వ పాఠశాలలోనే పనిచేస్తున్నారు. వీరు ఏ పాఠశాలలో పనిచేస్తే ఆ పాఠశాలలోనే వీరి పిల్లలను చేర్చడం వీరి నైజం. వీరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చి ఉన్నత స్థితికి తీసుకొచ్చారు.
       భర్త గుడివాడ శ్రీహరి పెడన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా,  భార్య శరత్ రమణి గూడూరు మండలం పోసిన వారి పాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. వీరికి ఇరువురు సంతానం. 
తెలుగు మీడియంలోనే బిడ్డల ప్రస్థానం
      వీరి అబ్బాయి గుడివాడ ప్రశాంత్ ఐదో తరగతి వరకు కోసూరు ప్రభుత్వ పాఠశాలలోనూ, ఆరవ తరగతి నవోదయ పాఠశాలలోనూ, ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాల మచిలీపట్నం నందు, ఇంటర్మీడియట్ ఆర్కే కాలేజీలో తదుపరి జేఎన్టీయూ హైదరాబాద్ లో సివిల్ ఇంజనీరింగ్ చేసి రెండు సంవత్సరములు పైగా టిసిఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసి అమెరికాలో ఎమ్మెస్ చేసి ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్ గా  పెన్సిల్వేనియాలో అత్యున్నత స్థాయిలో పని చేస్తున్నాడు. 
        అలాగే వీరి అమ్మాయి గుడివాడ శ్రీ రమ్య ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం లోనే చదివి ప్రస్తుతం అమెరికన్ కంపెనీ అట్లాంటా, హైదరాబాదు నందు పనిచేస్తోంది. 
        శ్రీరమ్య ఒకటి, రెండు తరగతులు రాంజీ ఉన్నత పాఠశాలలోనూ, మూడు, నాలుగు తరగతులు గూడూరు మండలం ఈదుముడి ప్రాథమికోన్నత పాఠశాలలోనూ, ఐదో తరగతి స్థానిక శిశువిద్య మందిరంలోను, ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు రుస్తుంబాదా గర్ల్స్ హై స్కూల్ నందు చదివి, పదవ తరగతిలో 10కి 10 జిపిఎ సాధించింది. తదుపరి ట్రిపుల్ ఐటీ నూజివీడులో చదివి 9.1 జిపిఏ తో మంచి ఫలితం సాధించి, క్యాంపస్ సెలక్షన్లో 45,000/- రూపాయల జీతంతో  ఉద్యోగ ప్రస్థానంలో తొలి అడుగులు వేసింది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అమెరికన్ టెలిగ్రాఫ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ హైదరాబాదులో అత్యంత ప్రతిభ చూపి 2023 అక్టోబర్ లో ఫుల్ టైం జాబు సాధించింది. శ్రీరమ్య కి ట్రావెలింగ్ అంటే అభిరుచి. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని, కొంగొత్త విషయాలు కనిపెట్టాలని శ్రీ రమ్య తపన.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు
        తమ బిడ్డలిద్దరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఈ తల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు.
       ఈ సందర్భంగా మీడియా ఈ దంపతులను పలకరించగా, శరత్ రమణి మాట్లాడుతూ తాము మొదటి నుండి తమ బిడ్డల్ని తాము పని చేసిన పాఠశాలలోనే చదివించామని, ముఖ్యంగా పదవ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదివించామన్నారు. పాఠశాల అనంతరం ఏ విధమైన ట్యూషన్లు పెట్టకుండా తమ బిడ్డల పర్యవేక్షణ బాధ్యతలు తామే చూసుకున్నామన్నారు. అందరు పిల్లలతో సమానంగా తమ పిల్లలు కూడా చదవాలనే సదుద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చామన్నారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా తమ పిల్లల్ని పెంచాం అన్నారు. తమ పిల్లలు కూడా సక్రమంగా చదివి ఉన్నత మార్గంలో స్థిరపడడం తమకు ఆనందదాయకంగా ఉందని మండవ వెంకట హిమ శరత్ రమణి అన్నారు.
         తెలుగు మీడియంలో చదివిన ఈ బిడ్డలు నిజ్జంగా రత్నాలై ప్రకాశించారు. ఇది గర్వకారణమే కదా! ఏ మీడియంలో చదివాం? అనేది ప్రధానం కాదు. మాతృభాషతో పాటు,ఇంగ్లీష్ భాషను కూడా నేర్చుకుంటూ, ఉన్నత స్థానానికి ఎదగొచ్చని వీరి బిడ్డలు నిరూపించారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ దంపతుల కృషి అజరామరం. కొంతమంది బిడ్డలు ఇంగ్లీష్ కాన్వెంట్ లో చదివినా సరైన స్థితిలో రాణించలేరు. బిడ్డలు సక్రమంగా రాణించాలి అంటే తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల పర్యవేక్షణ కూడా అత్యంత అవసరం. ముఖ్యంగా నైతిక విలువలు వ్యక్తిత్వ వికాసం  ఆవశ్యకం. 
         నేడు ప్రభుత్వ పాఠశాలలలో ఎందరో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థినీ, విద్యార్థులకు  మధ్యాహ్నం భోజన పథకం, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు తదితరాలను ఉచితంగా అందిస్తూ వారి భవితకు బాటలు వేస్తోంది. 
          పిల్లల భవిష్యత్తుకు ప్రైవేటు పాఠశాలలే పరమావధి అని భావించే విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రభుత్వ పాఠశాలలు సైతం పిల్లలను ప్రగతి మార్గంలో నడిపిస్తాయి అని నిరూపించిన ఈ ఆదర్శ తల్లిదండ్రులు అందరికీ నిదర్శనంగా నిలిచారు.

నందం రామారావు 
మచిలీపట్నం 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...