Skip to main content

బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలపై హత్యాయత్నం కేసు !!


మచిలీపట్నం: 

       అభం శుభం తెలియని బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలు జుజ్జువరపు సుప్రియ పై పామర్రు పోలీసులు ఆకారణంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారని మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. 

ఇటీవల పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ స్టేషన్ పరిధిలోని హోంగార్డు కోటేశ్వరమ్మపై హత్యాయత్నం చేశారనే కేసును సుప్రియపై నమోదు చేశారు. దీనిపై రిమాండ్కు వచ్చిన ఆమెను మచిలీపట్నం సబ్ జైలులో గురువారం పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి పేర్ని నాని పరామర్శించారు. అనంతరం మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ తెలుగు తమ్ముడు గణేష్ కళ్లలో ఆనందం కోసం పోలీసులు తీసుకున్న చర్యలు సరికాదని హితవు పలికారు. పొలంలో మినపకాయలు లాగుతున్న సమయంలో తన తండ్రిపై నేరం మోపేందుకు పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ లు స్టేషన్ కు పిలిపించారని ఆమె తెలిపారన్నారు. సోదరుడు తేజను దుర్భాషలాడితే దీనిపై సుప్రియ ప్రశ్నించినందుకు హోంగార్డు కోటేశ్వరమ్మతో బట్టలు చిరిగిపోయేలా ఆమెను లాక్కెళ్లటం అఘాయిత్యం కాదా అని పేర్ని ప్రశ్నించారు. మహిళ అని కూడా చూడకుండా ఛాతీపై చెయ్యి పెట్టి తోసేశారని ఆ అభాగ్యురాలు చెబుతుంటే నిర్ఘాంతపోయామన్నారు. సీఐ, ఎస్సైలు ఆమె పైన దాడి చేయడంతో రక్తం వస్తున్నా పట్టించుకోకపోవడంతో ఆటోలో బందరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందినట్లు తమకు తెలియజేసిందన్నారు. మూడు రోజులైనా వాంగ్మూలం రికార్డు చేయడానికి పోలీసులు రాకపోవడం దారుణమని తెలిపారన్నారు.
విన్నవించుకుందామని వస్తే అరెస్టు చేస్తారా?

తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని 'మీ కోసం'లో కలెక్టర్ బాలాజీ ఎదుట వ్యక్తం చేస్తే, ఆయన డిఎస్పీ శ్రీనివాసరావుకు ఆర్జీని బదిలీ చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. డీఎస్పీ ఆమెను నమ్మబలికి పామర్రు పోలీసులకు అప్పచెప్పారన్నారు. వారు గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం కోర్టులో హాజరుపరిచారని ఇలా చేయడం న్యాయమా అని పోలీసులను పేర్ని నాని ప్రశ్నించారు. కలెక్టర్కు ఏ రకంగా మర్యాద ఇస్తున్నారో గ్రహించాలన్నారు. ఎస్పీ నాయకత్వంలో పోలీసులు హోంగార్డు కోటేశ్వరమ్మను పావుగా ఎలా వాడుకున్నారో తెలుసుకోవాలన్నారు. కావాలంటే సీసీ పుటేజీని పరిశీలించాలని కోరారు. పోలీసులు ఆమెకు రిమాండ్ విధించేలా చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎంతో మంది టీడీపీ, జనసేన రౌడీలు రాజ్యమేలుతున్నా వారికి మాత్రం స్టేషన్ బెయిల్ తప్ప రిమాండ్ ఎందుకు ఉండదని ఆయన ప్రశ్నించారు.

ఈ పాపం ఊరికే పోదు..

టీడీపీ నాయకుడు గణేష్ కళ్లలో ఆనందం కోసం.. పోలీసులు ఆమె విషయంలో చేసిన పాపాలు ఊరికే పోవన్నారు. గణేష్ ఎన్నికల కౌంటింగ్ కు ముందు జుజ్జువరపు చిన్ని తమ్ముడి ఇంటిని తగలబెడితే కేసు నమోదు చేయలేదన్నారు. దళితురాలి విషయంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తోందో అర్థమవుతోందన్నారు. డిసీఎం పవన్ కల్యాణ్కు.. 50 మంది పోలీసులతో బందోబస్తు, ఒక విమానం ఇస్తే ఇలాంటి ఘటనలు కనపడకుండా పోతాయా అని ప్రశ్నించారు. ఓదార్పు మాటలు చెప్పి దళిత మహిళను జైల్లో పెట్టిస్తావా అని డిఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డు కోటేశ్వరమ్మ మీ అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి విచారణ చేస్తూ విర్ర వీగుతుంటే మీ చదువుకు అర్థం లేకుండా పోతుందన్నారు. అభం శుభం తెలియని జైలులో ఉన్న సుప్రియకు న్యాయం జరిగే రోజు త్వరలోనే ఆ దేవుడు కల్పించాలని పాము కోరుకుంటున్నామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...