మచిలీపట్నం :
కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని మంగినపూడి బీచ్ సమీపంలో ఉపాధి హామీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు మందగించిన నేపథ్యంలో, కూలీలకు స్థానికంగానే పని కల్పించే లక్ష్యంతో అధికారులు ఈ పనులను ముమ్మరం చేశారు.
తీర ప్రాంతంలో అభివృద్ధి పనులు
మంగినపూడి బీచ్ సమీపంలో ఉన్న కాలువల పూడికతీత, పిచ్చిమొక్కల తొలగింపు మరియు రహదారుల వెంట మట్టి పనులను ఉపాధి హామీ కూలీలతో చేయిస్తున్నారు. బీచ్ సందర్శనకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం పరిసరాలను శుభ్రం చేయడం, వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు
ప్రస్తుతం ఎండలు పెరుగుతున్న తరుణంలో, ఉదయాన్నే పనులు ప్రారంభించి మధ్యాహ్నానికల్లా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.
వృద్ధులకు, మహిళలకు వారి శారీరక సామర్థ్యానికి తగ్గట్టుగా పనులు కేటాయిస్తున్నారు.
తాళ్లపాలెం పంచాయతీ అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా మస్టర్లు నమోదు చేస్తున్నామని, ప్రతి కూలీకి గరిష్టంగా పనిదినాలు కల్పించడమే తమ లక్ష్యమని అధికారులు తెలిపారు. బీచ్ పరిసరాల్లో జరుగుతున్న ఈ పనుల వల్ల అటు కూలీలకు ఉపాధి దొరకడమే కాకుండా, పర్యాటక ప్రాంతం కూడా మెరుగుపడుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Post a Comment