Skip to main content

కక్షిదారులకు సత్వర న్యాయమే లోకఅదాలత్ ల ముఖ్య ఉద్దేశం: కృష్ణా జిల్లా జడ్జి జి. గోపి

మచిలీపట్నం, 10 మార్చి 2026, SSN:

         పెండింగ్ లో ఉన్న రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను సత్వరమే పరిష్కరించడమే జాతీయ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం అని కృష్ణా జిల్లా జడ్జి జి. గోపి అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాసదనము లో న్యాయమూర్తుల, న్యాయవాదుల సంయుక్త సమావేశానికి జిల్లా జడ్జి జి.గోపి ముఖ్యఅతిథిగా విచ్చేశారు
         మార్చి 14వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నందిగామ,  నూజివీడు తో సహా అన్ని న్యాయస్థానాలలో  లోక్ ఆదాలత్ బెంచ్ లు ఏర్పాటు చేసినట్లు జిల్లా జడ్జి వివరించారు. కేసులు సత్వర పరిష్కారానికి న్యాయవాదులు, పోలీసులు, ఇతర అధికారులు సహకరించాలని ఆయన తెలియజేశారు. సత్వర న్యాయం పొందడం ద్వారా ప్రజలకు న్యాయవ్యవస్థ పై మరింత నమ్మకం పెరుగుతుందని అన్నారు. 
           ఇటీవల భోపాల్  లో జరిగిన జాతీయ స్థాయి న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొన్న జి. గోపి సమావేశం వివరాలను తెలియజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల కృష్ణా జిల్లాకు విచ్చేసిన సందర్భంగా మీడియేషన్ పై ప్రత్యేక సదస్సు నిర్వహించి కేసులు పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన విషయం జిల్లా జడ్జి తెలియ చేశారు. 
         గత లోక్ ఆదాలత్ లో రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో ఉన్న కృష్ణాజిల్లాను మొదటి స్థానం స్థాయికి తీసుకురావాలని అందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కక్షిదారులు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని అన్నారు. లోక ఆదాలత్ లో పరిష్కారం చేసుకున్న సివిల్ ధావాలకు కోర్టు ఫీజు తిరిగి కక్షిదారులకు చెల్లిస్తారని అందుకోసం కృష్ణా జిల్లా కలెక్టర్మ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడినట్లు జిల్లా జడ్జి తెలియజేశారు.     
         ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ రామకృష్ణయ్య, కృష్ణా జిల్లా అదనపు జిల్లా జడ్జీలు జీ. వెంకటేశ్వర్లు, బి.బాబు నాయక్ ఎస్. సుజాత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి. పోతురాజు, పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...