Skip to main content

పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో వ్యవహార శైలిపై అవగాహన : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ


మచిలీపట్నం:

     జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థిని విద్యార్థులు తప్పుదారి పట్టకుండా మంచి చెడుల వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

     శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలసి వారి చాంబర్లో బాలబాలికలు, యువత భద్రతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. 
      ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాను రాను యువత వ్యవహార శైలి చాలా మార్పు చెంది తప్పుదారి పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
ముఖ్యంగా బాల్య దశలోనే  బాలికలకు మంచిగా తాకడం, చెడుగా తాకడం( గుడ్ టచ్, బ్యాడ్ టచ్) వంటి విషయాల పైన సరైన అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

     అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు నూటికి నూరు శాతం అర్థమయ్యే విధంగా వాటి గురించి వివరించాలన్నారు.  తొందరపాటు చర్యతో ముందస్తు గర్భధారణ వలన కలిగే ఇబ్బందులు విశదంగా తెలియజేయాలన్నారు. అంతే కాకుండా బాల్య వివాహాలు కూడా చేసుకోరాదని దాని వలన కలిగే నష్టాలను, ఆరోగ్య సమస్యలను వివరించాలన్నారు. 

      జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ 
తల్లిదండ్రులకు తమ పిల్లలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వారు తప్పుదారి పడుతున్నారన్నారు. 
ముఖ్యంగా బాలికలు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. జిల్లా విద్యాధికారీ వారానికి 3 రోజుల చొప్పున 10 రోజుల షెడ్యూల్ తయారు చేయాలని ఆ షెడ్యూల్ ప్రకారము  విద్యా, వైద్య , పోలీసు తదితర సంబంధిత శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 
       విద్యార్థుల తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలని తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు వారు తోడ్పడే విధంగా జిల్లా యంత్రాంగంతో సహకరించాలన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం లో విద్యార్థుల బాగోగుల గురించి సరైన అవగాహన కలిగించాలన్నారు. 

     వసతి గృహాలకు సెలవులు ఇచ్చినప్పుడు విద్యార్థులు వారి స్వగ్రామం వెళ్లే ముందు తల్లిదండ్రుల సమక్షంలో ముందస్తు గర్భధారణ, ఫోక్సో చట్టం బాల్యవివాహాల నిరోధక చట్టం గురించి క్షుణ్ణంగా వివరించాలన్నారు. అధికారులందరూ చొరవ తీసుకొని సమన్వయంతో కొంతకాలం అవగాహన తరగతులు నిర్వహిస్తే ఫోక్సో, బాల్యవివాహాలు వంటి నేరాలు తగ్గుతాయన్నారు. చదువు అందరికీ ముఖ్యమని, బాలికలు మధ్యలో చదువును ఆపకుండా దాని యొక్క విలువను కూడా తెలియజేయాలన్నారు

     బాలికలు గాని, యువతులుగాని ఎవరికైనా అవసరం అయితే 112 అనే హెల్ప్ లైన్ నెంబర్ కు గాని, 1098 చైల్డ్ కేర్ నెంబర్కు గాని ఫోన్ చేసి వారి ఇబ్బందులను తెలియజేయాలన్నారు అటువంటి వారికి రక్షణ కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.

      ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి సరళ కుమారి, డీఈవో సుబ్బారావు, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, బీసీ సంక్షేమ సాధికారత అధికారి రమేష్ , కార్మిక శాఖ సహాయ కమిషనర్ విష్ణు, ఐసిడిఎస్ పీవో విజయలక్ష్మి, డి సి ఆర్ బి సి ఐ పెద్దిరాజు, ఇంటర్ విద్యాశాఖ ఏజీఎంసి నాగ రవి తదితర అధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...