మచిలీపట్నం:
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీని నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఈనెల 31వ తేదీలోగా ఆస్తి పన్నులన్నీ చెల్లించాలని జిల్లా కలెక్టర్, మచిలీపట్నం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు.
మచిలీపట్నం నగరపాలక సంస్థ నూతన ప్రత్యేక పాలనాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై ఉన్న వడ్డీని 50% రాయితీ కల్పించిందన్నారు.
ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలన్నిటిని ఈనెల 31వ తేదీలోగా చెల్లించిన ఎడల వారికి వారు చెల్లించవలసిన వడ్డీలో 50 శాతం రాయితీ వర్తిస్తుందని కలెక్టర్ వివరించారు.
నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆస్తి పన్నులన్నీ త్వరగా చెల్లించిన యెడల నగరపాలక సంస్థ ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు.
అప్పుడే నగరంలో పలు పౌర సేవలు అందించుటకు అవకాశం లభిస్తుందన్నారు.
Comments
Post a Comment