Skip to main content

జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో 187 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళ పంపిణీ


మొవ్వ, 8 మార్చి 2026, SSN:         
            జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో 187 మందికి   ఆదివారం సాయంత్రం  ఉచితంగా కళ్ళజోళ్ళు అందజేశారు. ఫిబ్రవరి 28 న మొవ్వలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో సుమారు 370 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, కళ్ళజోళ్ళు సిఫారసు చేసిన 187 మందికి మొవ్వ శ్రీ మండవ జానకి రామయ్య, సులోచన క్షేత్రయ్య కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో  కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. 
          సేవే పరమావధిగా జయప్రద ఫౌండేషన్ సేవలందిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జయప్రద ఫౌండేషన్ ఛైర్మన్, టి.డి.పి. పాలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ పొలిటికల్ సెక్రటరీ, మాజీ యం.యల్.సీ. , యన్.టి.ఆర్. లిటరేచర్ కమిటీ అధ్యక్షులు  తొండెపు దశరధ జనార్దన్,  పామర్రు శాసన సభ్యులు  వర్ల కుమార్ రాజా, ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్  లింగమనేని రామలింగేశ్వర రావు , జయప్రద ఫౌండేషన్ మెంటార్ శ్రీమతి చెరుకూరి చాముండేశ్వరి, మొవ్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోనేపూడి శివరామయ్య, బార్లపూడి సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు తాతినేని పూర్ణచంద్రరావు, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు మండవ రత్నగిరి రావు, డాక్టర్లు శ్రీమతి నాదెళ్ల స్వాతి, డా గుత్తికొండ హర్ష, డా ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. 
        అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన 5 గురు మహిళలను అతిధులు ఘనంగా సత్కరించారు. సామాజిక సేవకు గాను శ్రీమతి మండవ బాల త్రిపుర సుందరి, సంగీత రంగంలో శ్రీమతి యేలేశ్వరపు రాధికా సుబ్రమణ్యం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీమతి మేకా రాణి, మిద్దె తోటల పెంపకానికి గాను శ్రీమతి బొందలపాటి రాణి, మొవ్వ మాజీ మండల అధ్యక్షురాలు కిలారపు మంగమ్మ లను సత్కరించారు.
         మొవ్వ గ్రామస్తులు  మండవ కోటేశ్వర రావు, శ్రీ మండవ ఫణి కుమార్ వైద్య శిబిరం ఏర్పాటు, కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమానికి పూర్తి సహకారమందించారు

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...