Skip to main content

మీకోసం అర్జీలు 126

మచిలీపట్నం, 9 మార్చి 2026, SSN:

ప్రజల నుండి అందే మీకోసం అర్జీల పట్ల అత్యధిక ప్రాధాన్యత నిచ్చి సానుకూలంగా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ చంద్రశేఖర రావు, మెప్మా పీడీ సాయిబాబు, డీఎస్పీ శ్రీనివాసరావు లతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక.... మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. 

మజ్జిదారుల అర్జీదారుల సమస్యలను జిల్లా కలెక్టర్ ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి ప్రత్యేక శ్రద్ధ వహించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు.

ఆ ప్రకారం కలెక్టరేట్లో ప్రజల నుండి మొత్తం 126 అర్జీలు అందాయి. వాటిలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:

మొవ్వ మండలం యద్దనపూడి గ్రామ కాపురస్తులు ఎంపీ ఎంఏసిఎస్ యద్దనపూడి ప్రస్తుత అధ్యక్షులు పామర్తి వీర జనార్దన్ రావు మాట్లాడుతూ యద్దనపూడి గ్రామంలో రీ సర్వే 180 లో మూడు సెంట్లు లేదా 145.2 చదరపు గజాల స్థలములో గ్రామపంచాయతీ వారు తీర్మానం మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం యద్దనపూడి పాల సేకరణ కేంద్రం 1982 సంవత్సరంలో భవన నిర్మాణం చేపట్టి అప్పటినుండి ఇప్పటివరకు యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని, ఆ స్థలానికి దక్షిణ వైపున ఉన్న సరిహద్దుదారు అయిన పామర్తి సాయిరాణి పాలసీకరణ కేంద్రం నిర్వహించుచున్న స్థలమును కూడా కలిపి 2022 సంవత్సరం దాఖలు దస్తావేజును వ్రాయించుకొని మచిలీపట్నం రిజిస్టార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, సదరు స్థలము ఖాళీ చేయాలని పాల సేకరణ కేంద్రానికి నోటీసు పంపియున్నారని, ఆమె కావాలనే దురుద్దేశపూర్వకంగా దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని పాల సేకరణ కేంద్రము ఖాళీ చేయాలని నోటీసు పంపి ఉన్నారని ప్రస్తుతం ఆమె ఆశ వర్కర్ గా కూడా పనిచేయుచు ప్రభుత్వం నుండి జీతం పొందుతుందని, అంగవైకల్యం కలిగి ఉన్నట్లుగా దొంగ సర్టిఫికెట్లు పుట్టించి పించను కూడా పొందుతున్నారని ఫిర్యాదు చేస్తూ ఆమెపై తమ చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.

స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) కృష్ణాజిల్లా అధ్యక్షులు బి పూజిత జిల్లా కార్యదర్శి ఎస్ సమరం అర్జీ అందజేస్తూ ఉయ్యూరు మండలం లోని విజయసాయి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వంశీకృష్ణ అనే విద్యార్థి మార్చి 6వ తేదీన షూ బదులు చెప్పులు వేసుకు వచ్చారనే కారణంతో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కనక లక్ష్మీ అందరి ముందు విద్యార్థి వేసుకొచ్చిన చెప్పులను విద్యార్థి మెడలో దండగా వేసి తరగతి గదిలో నిలబెట్టడం జరిగిందని ఈ సంఘటన చాలా అవమానకరమైన సంఘటన అంటూ ప్రిన్సిపాల్ కనకలక్ష్మి పై తగు చర్యలు తీసుకొని వచ్చే విద్యా సంవత్సరంనుండి ఆ పాఠశాల అడ్మిషన్లు నిలుపుదల చేయాలని, గుర్తింపు కూడా రద్దు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

మచిలీపట్నం నగరం సర్కిల్ పేటకు చెందిన దివ్యాంగులు గుంజి వీరయ్య తనకు సంవత్సరం కిందట నరాల బలహీనత వలన కాళ్లు చచ్చుపడిపోయి నడవలేని స్థితిలో ఉన్నానని, వృద్ధాప్య పించను వస్తోందని, తనకు చక్రాల కుర్చీని ఇవ్వడంతో పాటు దివ్యాంగుల పింఛను పొందే అవకాశం కల్పించాలని వేడుకున్నారు. 
దీంతో సంయుక్త కలెక్టర్ వెంటనే స్పందించి అతనికి చక్రాల కుర్చీలు తెప్పించి అందజేయడంతో పాటు సదారంలో పేరు నమోదు చేసుకునేందుకు వీలు కల్పించి దివ్యాంగుల పింఛను పొందే విధంగా చూడాలని వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ పర్యవేక్షకులు ప్రశాంతికి సూచించారు.

తదనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 11 12 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న దృశ్య అందుకు సంబంధించిన వివిధ ప్రభుత్వ శాఖల నివేదికలను సంక్షిప్తంగా వెంటనే అందజేయాలని ఆదేశించారు.
ఇంకా క్లెయిమ్ చేయని బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఈ కేవైసీ లను వెంటనే అందజేసి ఆ ఖాతాలు చురుకుగా పనిచేసే విధంగా సిద్ధం చేయాలన్నారు
మీకోసం అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత 24 గంటలలోగా పరిష్కరించవలసిన అర్జీలు ఇంకను 37 పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు.

పి...ఫోర్ బంగారు కుటుంబాల పరిశీలన నివేదిక ఇంకా అపరిస్కృతంగా ఉందని దానిని వెంటనే పంపాలన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆనంద కుమార్, డ్వామా పిడీ శివప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, డిపిఓ డాక్టర్ జే అరుణ, ఆర్ అండ్ బి ఈ ఈ లోకేష్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, డీఎస్ఓ మోహన్ బాబు, పౌరసరఫరాల సంస్థ డిఎం శివరాం ప్రసాద్, మార్క్ఫెడ్ డి ఎం మురళీ కిషోర్, మత్స్యశాఖ జేడి అయ్యా నాగరాజు డి సి ఓ చంద్రశేఖర్ ఎల్డిఎం రవీంద్రారెడ్డి తదితర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...