Skip to main content

రాష్ట్ర బడ్జెట్ పై సర్వత్రా హర్షం

దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన

బలహీన వర్గాల ఆకాంక్షాలకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు

మచిలీపట్నం :

        రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా, భవిష్యత్ కు భరోసా ఇచ్చేలా బడ్జెట్ ఉందని కృష్ణా జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు ,ఆంధ్రప్రదేశ్ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. 

        2026-2027 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మీడియా సమావేశంలో గురుమూర్తి మాట్లాడారు. స్వర్ణాంధ్ర -2047 లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా వేసిన బలమైన అడుగు ఈ బడ్జెట్ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సాగు నీరు, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ రంగాలను బలోపేతం చేసే విధంగా నిధులు కేటాయించారని తెలిపారు. 

         ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిన బడ్జెట్ ఇది అని అన్నారు. అదేవిదంగా రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన మూలధన వ్యయానికి రూ.53,915 కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,598 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు రూ.18,224 కోట్లు కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 

        జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో గృహనిర్మాణానికి రూ.6,357 కోట్లు కేటాయించారని తెలిపారు. సంక్షేమానికి మొత్తం రూ.91,527 కోట్లు కేటాయించగా, బీసీల అభివృద్ధికి రూ.51,021 కోట్లు, ఎస్టీలకు రూ.9,190 కోట్లు, మైనార్టీలకు రూ.6,090 కోట్లు, మహిళా–శిశు–వికలాంగుల సంక్షేమానికి రూ.4,582 కోట్లు కేటాయించారని వివరించారు. విద్యా రంగానికి భారీ ప్రాధాన్యం ఇస్తూ పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధికి గణనీయ నిధులు కేటాయించారని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు రూ.27,719 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.22,942 కోట్లు, వైద్యశాఖకు రూ.19,306 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ.11,000 కోట్లు కేటాయించారని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు కేటాయించడం రైతులకు పెద్ద ఊరట కలిగిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం అధిక వడ్డీతో అప్పులు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం వడ్డీభారం తగ్గించిందని తెలిపారు. వివిధ విభాగాల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు పేర్కొన్నారు. విజన్ 2047 లక్ష్యంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, వ్యవసాయం విద్య వైద్యం రంగాలను బలోపేతం చేసి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులను ఆకర్షించే విధంగా బడ్జెట్ రూపొందించిందన్నారు. ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపే ప్రగతి సాధక ప్రజా బడ్జెట్ అని వీరంకి వెంకట గురుమూర్తి గారు అన్నారు.
 
         ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా కార్యాలయ కార్యదర్శి బత్తిన దాస్,అధికార ప్రతినిధి కోస్తా మురళి,కార్యానివాహక కార్యదర్శి వసంత కుమారి,చిల్లిముంత ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...