Skip to main content

క్యాన్సర్ ప్రారంభ దశ లో గుర్తిస్తే ప్రాణ రక్షణ కలుగుతుంది.....పామర్రు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ తాత నీలిమ

మచిలీపట్నం :

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని కళాశాల ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మచిలీపట్నం లేడీ యాంప్తుల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రముఖ వైద్యులు డాక్టర్ తాత నీలిమా చే " క్యాన్సర్ పై అవగాహన సదస్సు" ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ నీలిమా మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో ఎక్కువమంది క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలియజేశారు. క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాలని దాని నివారణ చికిత్సలు చేసుకుంటే క్యాన్సర్ రోగాన్ని జయించవచ్చు ఆమె తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పాల్గొని 2000 సంవత్సరంలో ప్యారిస్ లో జరిగిన "వరల్డ్ సమీట్ ఎగైనెస్ట్ క్యాన్సర్" లో నిర్ణయం తీసుకున్నారని, ఆ మేరకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న క్యాన్సర్ వ్యతిరేక దినోత్సవం గా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

 క్యాన్సర్ పట్ల అవగాహన పెరగటం వల్ల మరణాలు తగ్గించవచ్చని మరియు వ్యాధి పట్ల ఉన్న అపోహలను తొలగించవచ్చు అని ప్రాథమిక దశలో చికిత్సతోనే క్యాన్సర్ ని జయించండి అనే నినాదంతో దేశ వ్యాప్తంగా వైద్య రంగంలో మార్పు వచ్చిందని తెలియజేశారు. ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి క్యాన్సర్ నివారణకు వైద్యం అందించాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని తెలియజేశారు. 

 ప్రిన్సిపాల్ పి లక్ష్మి మాట్లాడుతూ ధూమపానం, మద్యం పొగాకు దూరంగా ఉండాలని పీచు పదార్థాలు పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం చేస్తూ బరువును అదుపులో పెట్టుకోవడం వల్ల క్యాన్సర్ ని నివరించా వచ్చు అని తెలియజేశారు. ప్రతి ఆరు నెలలకు క్రమం తప్పకుండా క్యాన్సర్ పై స్క్రీనింగ్ టెస్ట్ లు చేయించుకున్నట్లయితే ప్రారంభ దిశలోనే నివారణ చేయవచ్చని తెలియజేశారు. 

దాదాపు 30 నుండి 50 శాతం వరకు క్యాన్సర్ మరణాలను ఆరోగ్యకరమైన అలవాట్లు మరియు ముందస్తు గుర్తింపు ద్వారా నివారించుకోవచ్చు అని డాక్టర్ నీలిమా తెలియజేశారు. మహిళలు ఎక్కువ మంది నిర్లక్ష్యం చేయటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కు గురవుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరనాధ్ బాబు అధ్యాపకులు మున్వర్ ;శ్రీనివాస్, జయప్రకాషష్ , జ్యోతి ,రత్న పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...