Skip to main content

ముందస్తు వైద్య పరీక్షలతో క్యాన్సర్ నివారణ ––జిల్లా కలెక్టర్



మచిలీపట్నం :

ముందస్తు వైద్య పరీక్షలతో క్యాన్సర్ ను అరికట్టగలమని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు.

బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ, మచిలీపట్నం జిజిహెచ్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని కోనేరు సెంటర్ నుండి బెల్ కంపెనీ వరకు వైద్య కళాశాల విద్యార్థులు, వైద్యాధికారులు, వైద్యులు తదితరులతో కలసి నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఖైనీ గుట్కా నమలొద్దు.. క్యాన్సర్ బారిన పడొద్దు, ముందస్తు పరీక్ష .. క్యాన్సర్ కు రక్ష, కలిసి పోరాడుదాం.. క్యాన్సర్ ను ఓడిద్దాం అంటూ జిల్లా కలెక్టర్ వారి చేత పలు నినాదాలు చేయిస్తూ ర్యాలీగా సాగారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, నివారించడం, చికిత్స చేయడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పాటిస్తామని తెలిపారు.
క్యాన్సర్ దేశంలో అతి వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రమాదకరమైన జబ్బు అని పేర్కొంటూ అసంక్రమిత వ్యాధులు (నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్) అంటే ఒక వ్యక్తి నుండి మరొకరికి నేరుగా సంక్రమించని గుండె జబ్బులు, క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం వంటి వ్యాధులలో ఇది ప్రథమ స్థానంలో ఉందన్నారు. ముందస్తు పరీక్ష ద్వారా ఈ క్యాన్సర్ ను అరికట్టగలమని చెబుతూ, తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడితే గనుక అభివృద్ధి చెందిన అత్యాధునిక వైద్య చికిత్స పద్ధతులతో రోగి జీవితకాలం గణనీయంగా పెంచవచ్చన్నారు. అలాకాకుండా అవగాహన రాహిత్యంతో క్యాన్సర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరిస్తూ తొలి దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

గత సంవత్సరం బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి కృషి, బెల్ కంపెనీ వారి సౌజన్యంతో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఒక ప్రత్యేక మొబైల్ బస్సును ఏర్పాటు చేశామని, ఇది ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాలలో 31 ప్రాంతాలలో తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా ఇప్పటి వరకు దాదాపు రెండు వేలకు పైగా వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 110 మందిని హయ్యర్ సెంటర్ కు రిఫర్ చేయడం జరిగిందని, వారిలో 28 మందికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, వ్యాధి చివర దశలో ఉన్న వారందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 

కార్యక్రమంలో మచిలీపట్నం జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ఆర్ ఎం ఓ డాక్టర్ నిరంజన్, నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వరలక్ష్మి, ఎంబిబిఎస్ కళాశాల వసతి గృహ వార్డెన్ డాక్టర్ నవీన్ చౌదరి, వైద్య కళాశాల విద్యార్థులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...