మచిలీపట్నం:
ఐఐటి ఆచార్యులు పొందుపరచిన సాంకేతిక సమాచారం తో నడుస్తున్న వర్చువల్ ల్యాబ్ వెబ్సైట్ ను ఇంజనీరింగ్ విద్యార్ధులు అనుసరించాలి ఆనీ అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ విభాగం ప్రొఫెసర్ ఆచార్య వి. శంకర్ సూచించారు. శుక్రవారం నాడు కృష్ణా విశ్వవిద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్ గా విచ్చేసి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి సాంకేతికంగా కొన్ని సూచనలు మెళకువలు చెప్పే క్రమంలో ముఖ్యంగా వర్చువల్ ల్యాబ్స్ అనే వెబ్ సైట్ గురించి దానిలో భారతదేశంలోని వివిధ ఐఐటీలలో పనిచేసే ప్రొఫెసర్లు పొందుపరిచిన సాంకేతిక విద్యా వివరాలతో పాటు విద్యార్థులకు ఉపయోగపడే అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు...
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె రాంజీ మాట్లాడుతూ ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపయోగపడే చాలా అంశాలను ఆచార్య వి శంకర్ చర్చించారని వాటిని మీ భవిష్యత్తును మలుచుకునే క్రమంలో సక్రమంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు వివరించారు. ఇంజనీరింగ్ కళాశాల బోధనా సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment