Skip to main content

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి....జిల్లా కలెక్టర్



మచిలీపట్నం :

మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జిల్లాలోనీ ఏ దేవాలయాల్లోను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ లతో కలిసి తహసిల్దారులు, దేవాదాయ శాఖ అధికారులతో మహాశివరాత్రి ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ వీ. విద్యాసాగర్ నాయుడు, డీఎస్పీలు జూమ్ మీటింగ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మోపిదేవి, పెదకల్లేపల్లి, ఎనమలకుదురు, కృత్తివెన్ను నాగేశ్వర స్వామి దేవస్థానం తదితర ప్రభుత్వ ప్రైవేటు దేవాలయాలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్నారు.సంబంధిత యాజమాన్యాలతోనూ దేవాదాయ శాఖ కార్యనిర్వాహక అధికారులతోనూ పోలీసు, రెవెన్యూ శాఖ సిబ్బంది సమన్వయం చేసుకొని భక్తులకు కావలసిన మంచినీరు, ఆహారము తదితర ఏర్పాట్లు సజావుగా అందేలా చూడాలన్నారు. జిల్లాలో దేవాలయాల వద్ద చిన్న ప్రదేశాలలో సామర్ధ్యానికి మించి భక్తులను లోనికి ప్రవేశించకుండా తగిన నియంత్రణ ఏర్పాటు చేయాలన్నారు.ప్రభుత్వ ప్రైవేటు అన్ని యాజమాన్యాల దేవాలయాలను సంబంధిత ఆర్డీవోలు, తహసిల్దార్లు, డిఎస్పీలు, సీఐలు ఎస్సైలు ముందుగానే ఆయా ప్రదేశాలను సందర్శించి సజావుగా పర్యవేక్షించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కావలసిన ఏర్పాట్లు చూడాలన్నారు.ఏదైనా అనుకోని సంఘటన జరిగితే నిష్క్రమనకు ఎక్కువ దారులు ఏర్పాటు చేయాలన్నారు. దర్శనానికి ఎక్కువ సమయం పట్టే పక్షంలో వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమయానికి ఆహారము, మంచినీరు అందించేలా చూడాలన్నారు.అంతేకాకుండా అంబులెన్స్లను, వైద్య శిబిరాలను ముందస్తుగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కోనేరు తదితర ప్రాంతాల్లో కూడా సామర్ధ్యానికి మించి భక్తులు నీటిలోకి దిగకుండా నియంత్రించాలన్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయము కలగకుండా రహదారి మార్గం సజావుగా పర్యవేక్షించాలన్నారు. వాహనాల పార్కింగ్కు అవసరమైన స్థలాలను ముందుగానే గుర్తించి తగిన ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మండలాల్లో వివిధ రకాల ముఖ్యమైన ఉత్సవాలు, జాతరలు జరిగే తేదీలను సిద్ధంగా ఉంచుకొని ఆయా రోజుల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ వీ.విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ దేవాలయాల వద్ద భక్తులు సురక్షితంగా ఉండేందు కోసం, శాంతిభద్రతలు పరిరక్షణ కోసం గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. 
సంబంధిత దేవాలయాల కార్యనిర్వాహణ అధికారులు దేవాలయాల వద్ద సమకూర్చవలసిన సౌకర్యాలపై పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. జనాల నియంత్రణకు ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేసి సీసీటీవీ ల ద్వారా డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు.అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వారి సెల్ నెంబర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
తొక్కిసలాట జరగకుండా దర్శనానికి వచ్చే భక్తుల కోసం అవసరమైతే క్యూ లైన్లు పెంచాల్సి ఉంటుందన్నారు.ఈ సమావేశంలో కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి దేవాదాయ శాఖ ఏసి సాంబశివరావు గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం పలువురు తహసిల్దార్లు డీటీలు దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...