Skip to main content

మీకోసం అర్జీల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి –– జిల్లా రెవెన్యూ అధికారి



మచిలీపట్నం :

ప్రజల నుంచి అందే మీకోసం అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు. కే ఆర్ ఆర్ సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఇనకుదురు పేట సీఐ ఎస్ పరమేశ్వర్ తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. 

కార్యక్రమం అనంతరం డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 3 వేలకు పైగా నిష్క్రియ బ్యాంకు ఖాతాలు (ఇనోపరేటివ్ బ్యాంక్ అకౌంట్స్) ఉన్నాయని, ఆయా శాఖల అధికారులు తక్షణం బ్యాంకులను సంప్రదించి ఈకేవైసీలు సమర్పించి అప్డేట్ చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేందుకు, రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచికలతో ఎంప్లాయి పర్ఫామెన్స్ ట్రాకింగ్ సిస్టం (ఈ పి టి ఎస్) అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకురానున్నదని, దీనిపై జిల్లా అధికారులు తమ సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. ఐ గాట్ కర్మయోగి ఆన్లైన్ కోర్సులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, దీనిపై ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పూర్తి చేయించే విధంగా తమ సిబ్బందికి సూచించాలని చెప్పారు.

ఈ నెల మూడవ శుక్రవారం కలెక్టరేట్లో ఉద్యోగుల గ్రీవెన్స్ డే నిర్వహించనున్నామని, ఉద్యోగులు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలని సూచించారు.

అర్జీలలో కొన్ని: 

పరిశీలన చేసి దివ్యాంగులకు కొత్తగా జారీ చేస్తున్న సదరం ధ్రువీకరణ పత్రాలు చాలామందికి అందలేదని, దీనివల్ల ఉద్యోగాలు, రైల్వే పాసులు, ఇతర సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని, రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన దివ్యాంగులందరికీ సకాలంలో సదరం ధ్రువీకరణ పత్రాలు అందించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కమిటీ తరఫున సత్యనారాయణ, శివశంకర్ తదితరులు అర్జీ సమర్పించారు. 

కొంతమంది అక్రమార్కులు ఇతర ప్రాంతాల నుండి యానాదులను అక్రమంగా తీసుకువచ్చి నాగాయలంక ఇలచేట్ల దెబ్బలో వారిని బంధించి భయభ్రాంతులకు గురిచేసి వారి చేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని, అనేక సంవత్సరాలుగా వారిని బానిసలుగా చేసుకున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు అర్జీ ద్వారా విన్నవించారు.

కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరరావు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారిణిలు ఎన్ పద్మావతి, జే జ్యోతి, జిల్లా పౌర సరఫరాల అధికారి జి మోహన్ రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, మార్క్ ఫెడ్ డీఎం మురళీ కిషోర్, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి సోమశేఖర్, పశుసంవర్ధక శాఖ అధికారి చిన నరసింహులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...