Skip to main content

రెవిన్యూ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టరు



మచిలీపట్నం :

జిల్లాలో రెవెన్యూ అంశాలపై పట్టు సాధించి రెవెన్యూ రికార్డులను పటిష్టపరిచి సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలసి రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించి రెవెన్యూ క్లినిక్, అధికారాల వినియోగం ,22 ఏ కేసుల పరిష్కారం, రీ సర్వే, జాయింట్ ఎల్ పి ఎం, పిజిఆర్ఎస్ మీకోసం, ఐవిఆర్ఎస్ ప్రజా స్పందన, ఈ కేవైసీ, పట్టాదారు పాసు పుస్తకాలు,కోర్టు కేసులు, సీనియర్ సిటిజెన్లు, ఎన్నికల అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ వివాదాలకు సంబంధించి రెవెన్యూజి అంటేనే రికార్డులను పరిశీలించి అన్ని విధాల విచారించి నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రీ సర్వేలో తప్పులు చేస్తే చారిత్రాత్మక తప్పులుగా నిలిచిపోతాయని గుర్తించుకొని చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా రీ సర్వే చేయాలన్నారు.

రీ సర్వేకు సంబంధించి జరిగే గ్రామ సభలకు తహసీల్దార్లు తప్పనిసరిగా హాజరై స్పీకింగ్ ఉత్తర్వులను ఇవ్వాల్సి ఉందన్నారు. అయినప్పటికీ కొందరు అలా చేయడం లేదన్నారు. ఇకనైనా ఈ విషయం తీవ్రంగా పరిగణించి అలా కాకుండా చూడాలన్నారు. 

రెవిన్యూ డివిజనల్ అధికారులు మండలాల్లో సర్వే సిబ్బంది వీఆర్వోలతో సమావేశం నిర్వహించి వివరాలు సేకరించాలన్నారు. రీ సర్వేలో విస్తీర్ణం 5 శాతానికి మించినప్పుడే ఇరువురి సంబంధిత భూహక్కుదారులతో మాట్లాడి జాగ్రత్తగా భూముల పరిష్కారం చేయాలన్నారు. రెవెన్యూ క్లినిక్ లలో వచ్చే అర్జీలపై పద్ధతి ప్రకారం సరైన చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రతి అర్జీని సరైన అవగాహన చేసుకోకుండా ఆలోచన చేయకుండా పిజిఆర్ఎస్ మీకోసం లో పోస్ట్ చేస్తున్నారని, అది సరైనది కాదని స్పష్టం చేశారు.
దీనివలన ప్రజలతోపాటు రెవెన్యూ సిబ్బందికి ఇబ్బంది ఉంటుందన్నారు. అర్జీ పరిష్కారం కాకపోవడమే కాకుండా సమయం కూడా వృధా అవుతుందన్నారు. సరైన అవగాహన చేయకుండా సమస్య పరిష్కారం కానందున మరల అర్జీలు పెట్టడం మొదలవుతుందన్నారు. 

రెవెన్యూ క్లినిక్ ల ఏర్పాటు ప్రధాన లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకూడదన్నారు.
రెవెన్యూ క్లినిక్ లో వచ్చే అర్జీలను సేవా పోర్టల్ లో నమోదు చేసి తగిన విధంగా పరిష్కరించాలన్నారు.
జిల్లాలో రెవిన్యూ క్లినిక్ లకు సంబంధించి విశ్లేషించగా 73 అర్జీలు రాగా అందులో 47 అర్జీలను సేవ పోర్టల్ లో పెట్టలేదన్నారు. దీనివలన అవన్నీ మరల వచ్చే అవకాశం కల్పిస్తున్నారన్నారు. సేవలకు సంబంధించి, ఓ ఆర్ సి ఎం ఎస్ కు సంబంధించి అర్జీలకు కాకుండా మిగిలినవి పిజిఆర్ఎస్ మీకోసం లో పోస్ట్ చేయాలన్నారు 

22 ఏ నిషేధిత జాబితా నుండి తొలగించే అంశాన్ని అర్జీలను సేవల పోర్టల్ లో పెట్టాలి గాని, పీజిఆర్ఎస్ మీకోసం లో పెట్టకూడదన్నారు.

రీ సర్వే చేసినప్పుడు భూముల విస్తీర్ణంలో ఎకరాకు 5 శాతం మించి ఉంటేనే ప్రభుత్వ సర్కులర్ ప్రకారం తగిన చర్యలు తీసుకొని సరిచేయాలన్నారు.
పక్కనున్న రైతులకు అర్హతకు మించి భూమి రికార్డు అయి ఉంటే ఇద్దరి ఒప్పందం తో సరి చేయాలన్నారు.

గ్రామ కంఠం ప్రభుత్వ భూమని దాన్ని సబ్ డివిజన్ చేయలేమన్నారు. అయితే భూ పరిపాలన ముఖ్య కమిషనర్ కార్యాలయానికి ఈ ఆఫీస్ ద్వారా వేరుగా ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుందన్నారు.

రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ లో ఏమైనా అనుమానాలు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలన్నారు తొందరపడి నిర్ణయం తీసుకోరాదని స్పష్టం చేశారు.భూమిపై ఎవరు ఉంటే వారికి హక్కు కాదని రికార్డుల ప్రకారం ఉండాలన్నారు. దున్నే ప్రతి భూమికి ఒక సర్వే నంబరు తప్పనిసరిగా ఉండాలని, సాదా బైనామా విధానంలో దున్నే వారి పేరు విచారించి నిర్ధారించి రికార్డులో నమోదు చేయాలన్నారు.

భూమి బదిలీ చేయుటకు నిర్ణయం అధికారం గుర్తుపెట్టుకోవాలన్నారు. భూహక్కుదారులతో మాట్లాడి ప్రతి నిర్ణయానికి తప్పనిసరిగా ఉత్తర్వులు ఉండాలన్నారు. ఉత్తర్వులు ఎఫ్ఎంబి ఒకటిగానే ఉండాలన్నారు. జాయింట్ ఎల్ పి ఎం ఉంటే పద్ధతి ప్రకారం అవగాహన లేకుండా చేస్తే సమస్య వస్తుందన్నారు.

సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ 4 వ విడత రీ సర్వే కార్యక్రమంలో గ్రౌండ్ ట్రూతింగ్ దశలవారీగా జరుగుతోందని అందుకు సంబంధించిన నివేదికలు ప్రతిరోజు ఆర్డీవోలు తప్పనిసరిగా పంపించాలన్నారు.

భూముల సబ్ డివిజన్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఈ ఆఫీస్ ద్వారా దస్త్రాన్ని నడపాలన్నారు. వెబ్ ల్యాండ్ లో ఆ వివరాలు నమోదు చేయాలన్నారు. తిరస్కరించిన వాటికి సంబంధించి క్యాటగిరి వారీగా కారణాలు రాయాలన్నారు. వెబ్ ల్యాండ్ లో తేడాలుంటే అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలపాలన్నారు. 

ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి అతుక్కుని ఉంటే దాన్ని విభజించేందుకు అవకాశం త్వరలో రానుందన్నారు. ఇందుకోసం పాత సర్వే నెంబరు, తదితర వివరాలు ఈ ఆఫీస్ ద్వారా పంపించాలన్నారు.

భూ నక్ష పోర్టల్ కు సంబంధించి దశల వారి కరెక్షన్ కు దస్త్రం సరి చేయుటకు సర్వే భూ రికార్డుల ఏడి ద్వారా తహసిల్దార్లు దస్త్రాన్ని తనకు పంపించాలన్నారు.

అనాధీన భూములు చుక్కల భూముల చట్ట ప్రకారం సవరణ చేయాలన్నారు. వెబ్లాండు పోర్టల్ తో పాటు సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.

పి జి ఆర్ ఎస్ మీ కోసం అర్జీలలో 3 శాతం అర్జీలు గడువు దాటి పరిష్కరిస్తున్నారని, 10 శాతం అర్జీలు మరల వస్తున్నాయన్నారు. అర్జీల పరిష్కారంలో నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించాలన్నారు 
ఉయ్యూరు డివిజన్లో ఎక్కువగా అర్జీలు ఒకే అంశంపై మరలా వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చే అర్జీలకు ఆలస్యం చేయకుండా పరిష్కారం చూపాలన్నారు. జిల్లా మొత్తంలో 429 అర్జీలు మరల (రీ ఓపెన్) వచ్చాయని, అందులో ఒక్కొ ఆర్డిఓకు 100కు పైగా అర్జీలు ఉన్నాయన్నారు.

ఇంటి స్థలం ఇవ్వకుండానే పౌరులు లబ్ధి పొందినట్లు చూపడం సరికాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు తహసీల్దారులు వివిధ అంశాలపై లేవనెత్తిన అనుమానాలను జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సమావేశంలో కేఆర్ఆర్సి ఎస్డిసి శ్రీదేవి గుడివాడ ఉయ్యూరు ఆర్డిఓలు జి బాలసుబ్రమణ్యం బిఎస్ హేలా షారోన్, సర్వే భూమి రికార్డుల ఏడి లక్ష్మణ్ , పలువురు తహసిల్దారులు, డీటీలు, సర్వేయర్లు తదితర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...