Skip to main content

గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఇంజనీరింగ్ విద్యార్థులు



మచిలీపట్నం :

          మచిలీపట్నం మండల పరిధిలోని మంగినపూడి గ్రామంలో వైజేఆర్‌డీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగం నిర్వహిస్తున్న ఏడు రోజుల ప్రత్యేక శిబిరంను విజయవంతంగా నిర్వహించారు . ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఈ శిబిరం ఫిబ్రవరి 15 న ముగుస్తోంది. 

         కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ డా. అబ్దుల్ నబి ఆధ్వర్యంలో మొత్తం 50 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొని గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. శిబిరం తొలి రోజు గ్రామ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమాలతో ప్రారంభమైంది. రెండవ రోజు ‘స్వచ్ఛత’ కార్యక్రమం నిర్వహించి, స్వచ్ఛ భారత్ లక్ష్యంతో గ్రామ పరిసరాలను శుభ్రపరిచారు. మూడవ రోజు ఆరోగ్య సంబంధిత సమస్యలపై గ్రామస్తుల అభిప్రాయాలను సేకరించే విధంగా అధునాతన సర్వే నిర్వహించారు.

          నాలుగవ రోజు ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే హానులపై మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఐదవ రోజు వేరుసెనగ పొలానికి వెళ్లి రైతులకు సహాయం చేయడంతో పాటు పంట కోత ప్రక్రియను తెలుసుకున్నారు. ఆ రోజునే నిర్వహించబోయే మెగా వైద్య శిబిరంను ,ఆరవ రోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించగా ఎల్.వి. ప్రసాద్ ఐ హాస్పిటల్ వైద్యులు నేత్ర పరీక్షలు నిర్వహించారు. కిషన్ డెంటల్ క్లినిక్ నిపుణులు దంత వైద్య సేవలు అందించారు. సత్య హాస్పిటల్స్ కు చెందిన ఆర్థోపెడిక్ నిపుణులు ఎముకల సంబంధిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు, కళ్లద్దాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వైద్య శిబిరానికి గ్రామస్తుల నుండి విశేష స్పందన వచ్చింది. ఏడవ రోజు మంగినపూడి సముద్ర తీరంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించి చెత్తను తొలగిస్తూ శుభ్రతపై సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంతో శిబిరం ముగింపు దశకు చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. 

          ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రవి కుమార్ , వైస్ ప్రిన్సిపాల్ డా. బి. నాగ జ్యోతి , ఎన్‌ఎస్‌ఎస్ విభాగాధిపతి డా. అబ్దుల్ నబీ,ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...