మచిలీపట్నం:
వాసవి క్లబ్ వనిత మచిలీపట్నం ఆధ్వర్యంలో2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని నిర్వహించిన వేడుకలు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.
మహిళల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అందరి హృదయాలను ఆకట్టుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళలు అద్భుతమైన వేషధారణలతో వేదికపై మెరిశారు. రంగురంగుల దుస్తులు, సాంప్రదాయ ఆభరణాలు, ప్రత్యేక అలంకరణలతో పాల్గొన్న మహిళలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రతి రాష్ట్ర ప్రత్యేకతను చాటి చెప్పేలా చేసిన ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ వేదిక ద్వారా వందలాది మహిళలు ఒకచోట చేరి పరస్పరం పరిచయాలు పెంపొందించుకోవడంతో పాటు, వారిలో చైతన్యం, ఆత్మవిశ్వాసం, ఆనందం నింపే ప్రయత్నం చేశామని నిర్వాహకులు తెలిపారు. మహిళల ఐక్యత, సామర్థ్యం, సృజనాత్మకతకు ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచిందన్నారు.
Comments
Post a Comment