Skip to main content

కృష్ణా జిల్లాలో పర్యటించిన సింగపూర్ బృందం - ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ



మచిలీపట్నం :

      జిల్లాలో వ్యవసాయం, ఆక్వా కల్చర్, పరిశ్రమలు, ఓడరేవు ప్రధానంగా జిల్లా అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లుగా దోహదపడతాయని జిల్లా కలెక్టర్ డీ కే బాలాజీ సింగపూర్ బృందానికి వివరించారు. 
    
       బుధవారం ఉదయం సింగపూర్ వ్యాపార, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చొంగ్ పూ షీన్ నేతృత్వంలో సింగపూర్ బృందం సభ్యులు చువా టైక్ హిం, నిషా షర్డా జిల్లాను అమరావతి ఆర్థిక కారిడార్ లో చేర్చి ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు ఉన్న అవకాశాలు, వనరుల పరిశీలనకు బాపట్ల నుండి బయలుదేరి నగరంలోని ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకోగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మర్యాదపూర్వకంగా వారికి పూల మొక్కలు అందజేసి, శాలువలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. 

           అనంతరం వారితో కలిసి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని మీకోసం సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో భౌగోళిక స్థితిగతులను, ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు ఉన్నటువంటి వనరులను సింగపూర్ బృందానికి విపులంగా తెలియజేశారు. 

         జిల్లా కలెక్టర్ బృందానికి వివరిస్తూ జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత సముద్రతీర ప్రాంతం అన్నారు.బ్రిటిష్ కాలం నుండి ఈ ప్రాంతంలో మంచి వనరులు ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉండటంతో పన్నులు ఎక్కువగా వసూలు అయ్యేవన్నారు.

         ఇక్కడ ప్రధాన ఇంజిన్ గ్రోత్ వ్యవసాయమేనన్నారు. ఈ ప్రాంతంలో సంవత్సరానికి వరి, మినుము రెండు పంటలు సాగు చేస్తారన్నారు.అప్లాండ్ ప్రాంతాలైన మల్లవల్లి, వీరపునేనిగూడెంలలో పారిశ్రామిక వాడలు నెలకొల్పడం జరిగిందన్నారు. 377 పరిశ్రమలకు స్థలాలు కేటాయించామన్నారు.అలాగే మేధా ఐటి టవర్స్, టిసియల్ కంపెనీ వంటివి ఏర్పాటు చేయబడ్డాయన్నారు.

       జిల్లాలో వ్యవసాయం ద్వారా 50 శాతం ఆదాయం లభిస్తోందన్నారు. అందులో 80 నుంచి 90 శాతం ఆక్వాకల్చర్ మీదనే వస్తుందన్నారు.ఈ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రైతులు ఎల్ ఆకారంలో మట్టి కట్టలు (ఎల్ బండ్) ఏర్పాటు చేసి కూరగాయలు తోటలను పెంచుతూ ఆదాయం లోటు లేకుండా చూసుకుంటున్నారన్నారు. ఇటీవల కాలంలో చాలామంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నారన్నారు. 
తొలకరి వర్షాలు పడకమునుపే 32 రకాల విత్తనపు బంతులు (సీడ్ బాల్స్ )తో ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పేరుతో వివిధ రకాల మొక్కలను ప్రయోగాత్మకంగా పెంచడం జరుగుతుందన్నారు.  తద్వారా భూమి పోషక విలువలతో సారవంతం అవుతుందన్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. తద్వారా ఆర్థిక అభివృద్ధి, నాణ్యత గల పంటలు ఉత్పత్తి, మంచి ధర లభిస్తుందన్నారు. 

        జిల్లాలోని ఆక్వా కల్చర్ లో ష్రిమ్ప్ రొయ్యల ఉత్పత్తి ప్రధానంగా జరుగుతోందని, దేశంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. పలు విదేశాలకు ఎగుమతులు చేస్తున్న చేయడం జరుగుతుందన్నారు ప్రపంచ మార్కెటులో పెద్ద ఎత్తున పోటీ ఉందన్నారు. ఆక్వా కల్చర్ లో డేటా సేకరణ, ట్రెసబిలిటీ ఇదివరకు సమస్యగా ఉండేదని నేడు ఆక్వా ఎక్స్చేంజ్ అనే స్టార్ట్ అప్ కంపెనీతో అనుసంధానం చేసుకొని జిల్లాలో నందివాడ మండలంలోని 6 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టగా విజయవంతంగా నడుస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగు చేయడం వలన విద్యుత్ బిల్లు ఆదా అవడంతో పాటు కూలి ఖర్చులు తగ్గాయన్నారు. చెరువులో రొయ్యలకు సమానంగా ఆహారం పంపిణీ అవుతుందన్నారు.ఆక్వా కల్చర్ సాగు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించే ఏర్పాటుతోపాటు బీమా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. చెరువుకు జియో ట్యాగింగ్ చేసి విశిష్ట నంబరు ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలో మండలమంతా విస్తరిస్తామన్నారు.
 
        రాష్ట్ర రాజధాని అమరావతికి బందరు గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు అతి సమీపంలో ఉందన్నారు. ఈ ఓడరేవు ఈ ఏడాది డిసెంబర్ నాటికి నాలుగు బెర్తులతో తొలి దశ పూర్తవుతుందన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు కూడా దగ్గర ఉన్న ఓడరేవు ఇదేనన్నారు.  హైదరాబాదు నుండి 6 వరసల జాతీయ రహదారి నిర్మించడం జరుగుతుందన్నారు. గేట్ వే ఆఫ్ అమరావతిగా మచిలీపట్నం నిలుస్తుందన్నారు. త్వరలో షిప్ బిల్డింగ్ కూడా ఓడరేవులో చేపట్టడం జరుగుతుందన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో రానున్నాయన్నారు.
అలాగే జిల్లాలో పెడన కలంకారి వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందని, ఘంటసాల లోని గౌతమ బుద్ధుని స్థూపాలు, చిహ్నాలు, మ్యూజియం ఉన్నాయని తద్వారా విస్తృతంగా పర్యాటకం అభివృద్ధి చ చెందుతుందన్నారు.

       మచిలీపట్నం ఒక గ్రాము బంగారం అనుకరణ ఆభరణాలకు ప్రసిద్ధి చెందిందని, సంవత్సరానికి 120 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు. కూచిపూడి శాస్త్రీయ నృత్యం దేశంలోనే పేరుగాంచిందన్నారు. కూచిపూడి నృత్యానికి సంబంధించి అవసరమైన దుస్తులను, వస్తువులను స్థానికంగానే తయారు చేయించడం జరుగుతుందన్నారు. తద్వారా సాంస్కృతిక వారసత్వ సంపదలను కాపాడుకుంటున్నామన్నారు. అలాగే మచిలీపట్నం శ్రీ పాండురంగ స్వామి దేవాలయం, మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము, ఆంధ్రమహావిష్ణువు నడయాడిన శ్రీకాకుళము, మంగినపూడి, హంసలదీవి బీచ్లు పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయన్నారు.

        ఆక్వా ఎక్స్చేంజ్ స్టార్ట్ అప్ కంపెనీ ప్రతినిధి కిరణ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ 69 వేల ఎకరాల్లో రైతులు తాము అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా కల్చర్ సాగు చేస్తున్నారన్నారు.పెడన కలంకారి కళాకారుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తన పూర్వీకుల నుండి తాను కళను నేర్చుకున్నానని 200 కోట్ల రూపాయల వ్యాపారం చేసేందుకు డిమాండ్ ఉందని సింగపూర్ బృందం సభ్యులకు నిశదీకరించగా బృందం సభ్యులు అతనిని అభినందించారు.

          ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, రాష్ట్ర ప్రణాళిక శాఖ సంచాలకులు రాంబాబు, సింగపూర్ బృందం జిల్లా సమన్వయ అధికారి డ్వామా పీడీ శివప్రసాద్, మచిలీపట్నం ఇంచార్జ్ ఆర్డిఓ పోతురాజు, జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆనందకుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ సోమ శేఖర్, పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణ రావు, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, ఐ సి డి ఎస్ పి డి ఎంఎన్ రాణి, డిఆర్డిఏ పిడి హరిహర నాథ్, డిపిఓ అరుణ, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం వెంకటరావు చేనేత జౌళి శాఖ ఏడి సాయి ప్రసాద్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...