Skip to main content

పీఎం కేర్ పథకంతో కోవిడ్ మహమ్మారి బాధితులకు అండ –– జిల్లా కలెక్టర్



మచిలీపట్నం: 

కోవిడ్–19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్ పథకంతో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.

కోవిడ్–19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రు లిద్దరినీ కోల్పోయిన పిల్లలకు జిల్లా కలెక్టర్ సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రధానమంత్రి సమగ్ర సహాయాన్ని (పీఎం కేర్) అందించి వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు, బాగోగులను తెలుసుకున్నారు. వారిలో 18 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులకు పోస్టల్ బ్యాంకు పాస్ పుస్తకాలను అందించారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 28 మంది పీఎం కేర్స్ లబ్ధిదారులు ఉండగా, వారిలో 17 మంది ప్రస్తుత కృష్ణా జిల్లా, 8 మంది ఎన్టీఆర్ జిల్లా, ముగ్గురు ఏలూరు జిల్లాకు చెందినవారు ఉన్నారని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్–19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సమగ్ర సంరక్షణ, రక్షణను అందించడం, ఆరోగ్య బీమా ద్వారా వారి శ్రేయస్సును నిర్ధారించడం, విద్య ద్వారా వారిని శక్తివంతం చేయడం, అదేవిధంగా 23 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఆర్థిక సహాయంతో స్వయం సమృద్ధిగా జీవించడానికి వారిని సన్నద్ధం చేయడం ఈ పీఎం కేర్ పథకం ముఖ్య లక్ష్యం అని తెలిపారు. అనాథలుగా మారిన పిల్లల విద్య, ఆరోగ్యం, వారి అభ్యున్నతి కోసం రూ. 10 లక్షల ఏకమొత్తం పీఎం కేర్ పథకం ద్వారా మద్దతును అందించి వారికి అండగా ఉంటుందన్నారు. 

జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని లక్ష్యసాధనకు శ్రమించాలని ఆయన ఈ సందర్భంగా వారికి ఉద్భోదించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వారి రెజ్యూమ్ లను పంపించాలని సూచిస్తూ, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పనకు కృషి చేయాలని నైపుణ్య అభివృద్ధి అధికారికి కలెక్టర్ సూచించారు.

కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ఫర్హిన్ జాహిద్, డిఆర్ఓ కే చంద్రశేఖరరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ సువార్త, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, ఇంచార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరావు, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, నైపుణ్య అభివృద్ధి అధికారి నరేష్ కుమార్, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ సతీష్, డీసీపీఓలు, సిడిపిఓలు, లబ్ధిదారుల సంరక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...