Skip to main content

ఆత్మీయ క‌ల‌యిక‌.. ఇల్లే వేదిక‌ -విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ స‌రికొత్త సంప్ర‌దాయం


- పార్ల‌మెంటు వారీగా ప్ర‌జాప్ర‌తినిధులు, కుటుంబాల‌కు విందు
- మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు ప్ర‌జాప్ర‌తినిధులు, కుటుంబాల‌తో ముచ్చ‌ట్లు
- ఆడ‌ప‌డుచుల‌కు మంగ‌ళ‌గిరి ప‌ట్టుచీర‌లు పెట్టిన లోకేష్
- ప్ర‌జాప్ర‌తినిధులు ఇచ్చిన విన‌తుల తాజాస్థితిని నివేదిక రూపంలో అంద‌జేసిన లోకేష్‌

         పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కుటుంబ‌స‌భ్యుల‌తో త‌న ఇంటికి ఆహ్వానించి, ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో విందు ఏర్పాటుచేసి, మాట‌లు-ముచ్చ‌ట్ల‌తో గ‌డిపే స‌రికొత్త సంప్ర‌దాయానికి విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. 

           ఉండవ‌ల్లి నివాసంలో గురువారం రాత్రి మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం కూట‌మి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కుటుంబ‌స‌భ్యుల‌తో త‌న ఇంటికి విందుకు ఆహ్వానించారు లోకేష్. ఈ సంద‌ర్భంగా పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అంతా ఒకేచోట కూర్చుని భోజ‌నం చేశారు. ప్ర‌జాప్ర‌తినిధుల కుటుంబ‌ స‌భ్యులంద‌రినీ పేరుపేరునా ప‌ల‌క‌రించిన లోకేష్‌, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని ఆత్మీయంగా మాట‌లు క‌లిపారు. 
          ఎటువంటి రాజ‌కీయ‌ చ‌ర్చ‌ల‌కు తావులేకుండా పూర్తిగా కుటుంబంలో జ‌రిగే శుభ‌కార్యంలా నిర్వ‌హించారు. త‌న ఇంటికి వ‌చ్చిన ఆడ‌ప‌డుచుల‌కు లోకేష్ త‌న నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరి చేనేత క‌ళాకారులు నేసిన‌ ప‌ట్టుచీర‌లు బ‌హుక‌రించారు. ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి, వివిధ స‌మ‌స్య‌ల‌పై త‌న‌కు ఇచ్చిన విన‌తులు తాజా స్థితి ఏంటో తెలియ‌జేస్తూ మంత్రి నారా లోకేష్ వారికే నివేదిక రూపంలో అందించారు. ఇందులో తాను ప‌రిష్క‌రించిన‌వి, ప‌రిష్కార ద‌శ‌లో ఉన్న‌వి, చేయ‌లేక‌పోయిన‌వి..కార‌ణాలు పేర్కొంటూ ఇచ్చిన ఈ నివేదిక‌ను చూసి ప్ర‌జాప్ర‌తినిధులు ఆశ్చ‌ర్య‌పోయారు. 

         ఇంత ట్రాన్స‌ప‌రెన్సీ రాజ‌కీయాల్లో చూడ‌టం ఇదే మొద‌టిసారి అంటూ త‌మ స‌హ‌చ‌రుల‌కు చెబుతూ సంతోషం వ్య‌క్తం చేశారు. కుటుంబ విలువ‌ల‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త నుంచి నాయ‌కుడి వ‌ర‌కూ అందరినీ కుటుంబ‌స‌భ్యులుగా భావిస్తుంది. ఎన్టీఆర్ నుంచి మొద‌లైన ఈ సంప్ర‌దాయం, చంద్ర‌బాబు  మ‌రో స్థాయికి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నారా లోకేష్ ప్ర‌జాప్ర‌తినిధుల‌ కుటుంబాల‌ను ఇంటికి పిలిచి గౌర‌వించి పంపించే స‌రికొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం చుట్టారు. 
     
          పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఉండ‌టంతో మ‌చిలీప‌ట్నం ఎంపీ బాల‌శౌరి (జ‌న‌సేన‌), అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కార‌ణంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ ఆత్మీయ క‌ల‌యిక‌కు హాజ‌రు కాలేదు. మంత్రి-మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే కొల్లు ర‌వీంద్ర‌, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, పెడ‌న ఎమ్మెల్యే కాగిత కృష్ణ‌ప్ర‌సాద్‌, అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ (జ‌న‌సేన‌), పామ‌ర్రు ఎమ్మెల్యే వ‌ర్ల‌కుమార్ రాజా, పెన‌మ‌లూరు ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కుటుంబ‌ స‌భ్యుల‌తో త‌ర‌లివ‌చ్చి ఆత్మీయ క‌ల‌యిక‌లో ఆనందంగా గ‌డిపారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...