Skip to main content

అధికారులకు వినతి పత్రం అందించిన భారతీయ జనతా పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు శ్రీరామ్



మచిలీపట్నం :
 
       సోమవారం మీకోసం స్పందన కార్యక్రమంలో జనతా వారధి ద్వారా ప్రజల తరఫున గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ పేరుతో ప్రతి పేదవాడికి సెంటు భూమి, ఇల్లు అనే పథకంలో జరిగినటువంటి అవకతవకలు , అనధికారిక వసూళ్ల గురించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొని లబ్ధిదారులకు న్యాయం చేయాలి బిజెపి కృష్ణాజిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్  జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. 

జగనన్న ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకొనుటకు అధికారులు సహకరించవలసిందిగా వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి భూమి యొక్క కొత్త పాసు పుస్తకాల వ్యవహారంలో జరుగుతున్న జాప్యము ను, అక్రమ వసూళ్ల గురించి, అలాగే రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చే నోషనల్ ఖాతా నంబర్ బదులుగా శాశ్వత ఖాతా నెంబర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పాస్ బుక్ కూడా ఆర్ ఓ ఆర్ వన్ బి , అడంగల్ తరహాలో ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే విధంగా అవకాశం కల్పించి పాసు పుస్తకాల ముద్రణకు అయ్యే ఖర్చు తగ్గించి సమయం ఆదా చెయ్యాలని అన్నారు. సినిమా హాళ్ల నిర్వహణలో జరుగుతున్న లోపాల గురించి, మొత్తం మూడు వినతులు సమర్పించి తక్షణమే విచారణ చేపట్టి పరిష్కరించాలని తెలిపారు.

 ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కృష్ణాజిల్లా జనతా వారధి కన్వీనర్ సిద్ధార్థ , బిజెపి సీనియర్ నాయకులు పంతం వెంకట గజేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల రామాంజనేయులు, ట్రెజరర్ సుబ్బారావునాయుడు , సాలాది రామకృష్ణ , నరేంద్ర , చదలవాడ వీరేంద్ర , తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...