Skip to main content

అభివృద్ధికి ప్రతీకగా బందరును తీర్చిదిద్దుతా



- ఇప్పటికే రూ.54 కోట్లతో గ్రామీణ రోడ్ల నిర్మాణం
- రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు తొలి ప్రాధాన్యం
- మచిలీపట్నంలో పలు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.

మచిలీపట్నం :

 మచిలీపట్నం నియోజకవర్గంలోని ప్రతి వీధికి, ప్రతి గ్రామానికీ మంచినీటి సదుపాయం, రోడ్ల నిర్మాణం చేపట్టి అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఉపాధి హామీ నిధుల్లో రూ.90 లక్షలతో మంగినపూడి బీచ్ వద్ద, రూ.60 లక్షలతో పోతేపల్లి జ్యూవెలరీ పార్కు వద్ద సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పోతేపల్లి జ్యూవెలరీ పార్కులోని పలు పరిశ్రమలు, షాపుల్లో కలియదిరిగారు. జ్యూవెలరీ తయారీ, ప్యాకింగ్, మార్కెటింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. పోతేపల్లి జ్యూవెలరీ పార్కు మన అస్తిత్వానికి నిదర్శనం. అలాంటి కళను కాపాడుకోవడంతో పాటుగా, తగిన గుర్తింపు తీసుకు రావడం, పారిశ్రామికవేత్తలకు సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెడతానన్నారు. 

 అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.54 కోట్లు ఖర్చు చేశాం. రోడ్లు అన్నింటినీ అభివృద్ధి చేస్తున్నాం. మంగినపూడి బీచ్‌ను అభివృద్ధి చేస్తున్నందువలన జనాభా పెరుగుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. అదే సమయంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా రోడ్లను పూర్తి చేశాం. డ్రైన్లను కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.

 పోతేపల్లి జ్యూవెలరీ పార్కును మోడల్ పార్కుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతానికి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలున్నాయి. ఎంతో ప్రఖ్యాతిగాంచిన గోల్డ్ కవరింగ్ జ్యూవెలరీ పరిశ్రమలున్నప్పటికీ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ప్రధానంగా డ్రైనేజీ సమస్యల కారణంగా ఇక్కడ పని చేసే మహిళలు అనారోగ్యం పాలవుతున్నారు. త్వరలోనే రోడ్డు నిర్మాణంతో పాటుగా, డ్రైనేజీ పనులను కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. రోడ్లపై ఎక్కడా మురుగు నిలిచేందుకు ఆస్కారం లేకుండా చూడాలని, అవసరమైతే రోడ్డును ఎత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో రాజ్యసభ సభ్యులు చిరంజీవి గారి నిధులతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. 

 ఆటోనగర్ ప్రాంతంలో ఓవర్ హెడ్ ట్యాంకు లేకపోవడంతో తాగునీటికి ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. త్వరలోనే ఏపీఐఐసీతో సంప్రదించి ఆటోనగర్లో ఓవర్ హెడ్ ట్యాంకర్ ఏర్పాటు చేస్తాం. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినప్పటికీ గత ఐదేళ్ల నిర్లక్ష్యంతో ట్రాక్ పాడైంది. భవిష్యత్తులో మరింత సుందరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచిస్తాను. మోడల్ పార్కుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు , డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ , గోపు సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

-

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...