ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం
మచిలీపట్నం :
మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ లో ఆందోళన చేస్తున్న ఏపీ అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు, కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్లు గత 5 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు..అంగనవాడి కార్మికుల డిమాండ్ లను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పరిష్కరించకపోతే, మార్చి 2న విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది అని విమర్శించారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని పలు సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో తక్షణమే ఈ అంశంపై చర్చ జరగాలి," అని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే, మార్చి 2న "చలో విజయవాడ" కార్యక్రమం నిర్వహించి, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Post a Comment