మచిలీపట్నం :
ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలను సజావుగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ఉయ్యూరు మండలంలో పర్యటించి తహసిల్దార్ కార్యాలయాన్ని, ఆకునూరు గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించడంతోపాటు, ప్రతి రైతుకు ముసాయిదా పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చి ధ్రువీగించుకున్నారా లేదా క్షేత్రస్థాయిలో రీ సర్వే ఎలా జరిగిందో పరిశీలన చేశారు. ఆ గ్రామంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు కలెక్టర్ పంపిణీ చేశారు.
అనంతరం కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
ప్రతి రైతుకు ముసాయిదా పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చి ధ్రువీకరించుకున్నారా లేదాపూర్వము చేసిన సర్వేలో విస్తీర్ణంలో ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా లేదా, పట్టాదారు పాస్ పుస్తకాల సరిగా ఉన్నాయా లేదా అని రైతులను విచారించారు.
సరిగా ఉన్నాయని రైతులు చెప్పడంతో జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఏమైనా వ్యత్యాసాలు ఉంటే ఎలా పరిష్కరిస్తారు అని కలెక్టర్ ప్రశ్నించగా రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్( సిసిఎల్ఏ) మార్గదర్శకాల ప్రకారం పరిష్కరిస్తామని సర్వే సిబ్బంది కలెక్టర్కు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉయ్యూరు ఆర్డిఓ బిఎస్ హేలా షారోన్, తహసిల్దార్ సురేష్, రీ సర్వే డీటీ వెంకటేశ్వరరావు, ఆర్ ఐలు, వీఆర్వో, సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.
Comments
Post a Comment