Skip to main content

అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం

మచిలీపట్నం :

కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కేడీసీసీబీ) చైర్మన్ నెట్టెం రఘురాం బుధవారం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి, కేడీసీసీ బ్యాంక్ పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పిఎసిఎస్) వాటిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిపాలనా అంశాలపై పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి వినతిపత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలో పిఎసిఎస్ సంఘాల్లో సీఈఓ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అర్హులైన ఉద్యోగులకు ఒకసారి ప్రత్యేక ప్రమోషన్లను పరిశీలించవలసిందిగా ఆయన అభ్యర్థించారు. పలు గ్రామీణ పిఎసిఎస్ సంఘాలు డైలీవేజ్ సిబ్బందిపై ఆధారపడి పనిచేస్తున్నాయని, అందువల్ల అర్హత పరీక్ష నిర్వహించి, అర్హులైన వారికి న్యాయబద్ధంగా అవకాశం కల్పించాలనే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. కేడీసీసీ బ్యాంక్ , పిఎసిఎస్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయమై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసిన విధంగా వీరికి కూడా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచితే అనుభవజ్ఞులైన సిబ్బంది సేవలు మరింత కాలం అందుబాటులో ఉంటాయని తెలిపారు.

కొన్ని వేతనాలు “సస్పెన్స్ డ్యూ టు అకౌంట్" కింద నిల్వ ఉండటం వల్ల ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని క్రమబద్ధీకరించేందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయవలసిందిగా ఆయన కోరారు. అదేవిధంగా, అవసరమైన విద్యార్హతలు పొందేందుకు గతంలో ఇచ్చిన గడువును మరికొంత కాలం పొడిగిస్తే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఉద్యోగులకు ఉపశమనం కలుగుతుందని, వారి ఉద్యోగ భద్రత కాపాడబడుతుందని అభ్యర్థించారు. ఈ వినతులన్నీ ఉద్యోగుల ప్రయోజనాలకే పరిమితం కాకుండా, గ్రామీణ సహకార వ్యవస్థ బలోపేతానికి, రైతులకు నిరంతర సేవలందించేందుకు దోహదపడతాయని నెట్టెం రఘురాం తెలిపారు. ముఖ్యమంత్రి నెట్టెం రఘురాం వినతిని శ్రద్ధగా విని, సంబంధిత శాఖలతో పరిశీలించి సాధ్యమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...