Skip to main content

ప్రజల కోసం ప్రజల్లోంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం



- దశాబ్దాల కలకు నేడు జీవం పోయడం సంతోషంగా ఉంది
- ప్రతి కార్యకర్తా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి
- సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాకారం
- తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా నూతన పార్టీ కార్యాలయ శంకుస్థాపన వేడుకలో మంత్ర కొల్లు రవీంద్ర.
మచిలీపట్నం:

కృష్ణా జిల్లాకు సొంత పార్టీ కార్యాలయం నిర్మాణం ఎన్నో సంవత్సరాల కల. ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసినా.. సఫలం కాలేదు. కానీ నేడు కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని వలందపాలెం పాత ఆర్టీవో కార్యాలయం వద్ద కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయానికి ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావు, జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ, ఎమ్మెల్యేలందరి సమక్షంలో భూమిపూజ చేశారు. 

ముఖ్యమంత్ర నారా చంద్రబాబు నాయుడు , జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేష్ ప్రోద్బలంతో నూతన కార్యాలయానికి శంకుస్థాపన చేసుకుంటున్నాం. ప్రజలకు సేవ చేయాలి.. ప్రజల కోసం పని చేయాలనే ఏకైక లక్ష్యంతో నిత్యం పని చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు ఏ ముహూర్తాన ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారో కానీ, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడినటువంటి పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే.
మనం అధికారం ఉన్నా, అధికారంలో లేకపోయినా నిరంతరం ప్రజా సమస్యలని తెలుసుకోవడం, ప్రజా వేదిక ద్వారా ఆ సమస్యల పరిష్కారం చేయడం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆనవాయితీగా మారింది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడంతో పాటుగా, ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యాలయం చాలా ఉపయోగపడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి స్థితిగతుల్ని మార్చడానికి, పేద, బడుగు, బలహీన వర్గాల భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేయడానికి, ఈ జిల్లా అభివృద్ధికి గాని కార్యాలయంలోనే రేపు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం.

పార్టీ కార్యాలయానిక వచ్చే ప్రతి ఒక్కరికీ పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకుంటాం. కార్యకర్తలు సమావేశాలు నిర్వహంచుకోవడానికి కూడా వీలుగా ఉండేలా విశాలంగా నిర్మాణం చేపడుతున్నాం. ఇదేదో ఆర్భాటాల కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మాకు ఉందని మేమేదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు. నిరంతరం ప్రజలకు సేవ చేయడానికి ఈ కార్యాలయం కేంద్రంగా నిలవబోతుంది. గత ప్రభుత్వంలో సమస్య చెప్పుకోవడానికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లే అవకాశం లేదు. సచివాలయాలకి వెళితే వాళ్ళని బెదిరించడం, ఫోటోలు తీయడం, భయపెట్టడం, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా ఇవాళ జిల్లా కార్యాలయాలు, నియోజకవర్గ స్థాయిలో కూడా శాసనసభ్యులు చైర్మన్‌గా జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని, సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా అడుగులు వేస్తున్నాం. కార్యాలయాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...