Skip to main content

రోడ్డెక్కిన అధికార, ప్రతిపక్షాలు

  

    జనవరి 31, 2026 న ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఉదయం నుంచి రెండు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో మొదలైన శనివారం... సాయంకాలానికి ఆస్తుల ధ్వంసం, అరెస్టుల వరకు వెళ్లి రాష్ట్రం  ఉలిక్కిపడేలా చేసింది.

        ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న ఈ ఘటన మూలం ఒక్కసారి చూద్దాం!

ఫ్లెక్సీ బ్యానర్

 గుంటూరులోని గోరంట్ల వద్ద భారీ ఫ్లెక్సీ వెలిసింది. దీనిపై మహాపాపం అని రాసి ఉండటంతో పాటు వైసీపీ నాయకత్వాన్ని, నాయకులను విమర్శిస్తూ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ బ్యానర్ విషయం పైనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ మొదలై, aa అనుచిత వ్యాఖ్యలు, అరెస్టులకు దారి తీసింది.

అయితే ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రెచ్చగొట్టే విధంగా బ్యానర్లు కట్టవచ్చా?

బ్యానర్ కట్టాలంటే నిబంధనలు ఉన్నాయా?

అనుమతులు తీసుకోవాలా?

బ్యానర్ల నియమ నిబంధనలు

          ఎక్కడైనా బ్యానర్ కట్టాలంటే స్థానిక మున్సిపాలిటీ లేదా నగర పాలక సంస్థ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి పొందిన బ్యానర్లపై మున్సిపల్ హోలోగ్రామ్ లేదా క్యూఆర్ కోడ్ ఉండాలి. 

         ఎన్ని రోజుల వరకు ఆ బ్యానర్ అక్కడ ఉండాలో ముందే తెలపాలి. ప్రతి ఫ్లెక్సీ పైన ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా, కస్టమర్ పేరు, ఫోన్ నంబర్, అనుమతి పొందిన సీరియల్ నంబర్ ముద్రించబడి ఉండాలి.

      ముఖ్యంగా ఫ్లెక్సీలపై వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మేటర్ ఉండకూడదు.

నిషేధిత ప్రాంతాలు

       బ్యానర్లను కొన్ని ప్రాంతాల్లో కట్టకూడదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ అడ్డుగా ఉండేలా కట్టకూడదు. విద్యుత్ స్తంభాలు లేదా ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర, పాదచారులకు ఇబ్బంది కలిగించేలా ఫుట్‌పాత్‌లపై, ప్రభుత్వ కార్యాలయాలు, విగ్రహాల పైన బ్యానర్లు కట్టడం నిషిద్ధం.       

నిబంధనలు ఉల్లంఘిస్తే 

ఫ్లెక్సీలు, బ్యానర్లు మరియు ప్రకటనల బోర్డుల ఏర్పాటుకు సంబంధించి భారతదేశంలో బలమైన చట్టాలు, సెక్షన్లు ఉన్నాయి. వీటిని అతిక్రమిస్తే జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.

జరిమానాలు, శిక్షలు

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో వర్తించే ప్రధాన చట్టాలు 

ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టం (AP Municipalities Act, 1965)

మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కడితే చర్యలు తీసుకోవచ్చు

      మున్సిపల్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు, బ్యానర్లు కట్టడం చట్ట విరుద్ధం. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితే భారీ జరిమానాలు విధించవచ్చు. ప్రకటనల పన్ను చెల్లించకుండా ఫ్లెక్సీలు వేయడం ఆర్థిక నేరం కిందకు వస్తుంది. 

బహిరంగ ప్రదేశాల వికృతీకరణ నిరోధక చట్టం (Prevention of Disfigurement of Open Spaces Act)

      ప్రభుత్వ ఆస్తులు, గోడలు లేదా విగ్రహాలపై ఫ్లెక్సీలు కట్టడం ఈ చట్టం ప్రకారం నేరం. ఈ చట్టం కింద నేరం రుజువైతే 3 నుండి 6 నెలల జైలు శిక్ష లేదా రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు జరిమానా (లేదా రెండు) విధించవచ్చు.

ఫ్లెక్సీల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగితే 

భారతీయ శిక్షా స్మృతి (IPC) - ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత (BNS)

సెక్షన్ 268 (Public Nuisance): ఫ్లెక్సీల వల్ల ప్రజలకు లేదా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగితే 'పబ్లిక్ న్యూసెన్స్' కింద కేసు నమోదు చేయవచ్చు.

సెక్షన్ 153A: రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించేలా (మతం, కులం లేదా రాజకీయంగా) ఫ్లెక్సీల్లో మేటర్ ఉంటే ఈ సెక్షన్ కింద నాన్-బైలబుల్ కేసు పెట్టవచ్చు.

సెక్షన్ 505: రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా తప్పుడు ప్రచారాలు ఫ్లెక్సీల ద్వారా చేస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. 

హైకోర్టు మార్గదర్శకాలు

      ఉమ్మడి హైకోర్టు మరియు ప్రస్తుత ఏపీ హైకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యేలా ఫ్లెక్సీలు కట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. మున్సిపల్ అధికారులు తమ విధి నిర్వహణలో ఫ్లెక్సీలను తొలగించకపోతే, ఆ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవచ్చు.

శ్యామ్ కాగిత,
మచిలీపట్నం 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...