- ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యములో క్యాన్సర్ అవగాహన సదస్సు
మచిలీపట్నం:
రోజు వారి ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవడం సాధ్యమవుతుందని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రాంజీ అన్నారు. మణిపాల్ ఆస్పత్రికి సౌజన్యం తో కృష్ణా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ 1,2,3 ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ల ఆధ్వర్యములో బుధవారం క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తో పాటు ఆర్డర్ ల పై కొనుగోలు చేస్తున్న ఆహార పదార్థాల తయారీలో క్యాన్సర్ కారక పదార్థాలు ఎక్కువగా వినియోగించడం జరుగుతుందన్నారు. ఇటువంటి ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ఎంతైనా అవసరమన్నారు. మహిళలు ముఖానికి పసుపు రాసుకునే అలవాటు మన పూర్వీకులు నేర్పించడానికి ప్రధాన కారణం క్యాన్సర్ రాకుండా పసుపు నిరోధిస్తుందని అన్నారు.
రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు మాట్లాడుతూ తొలి దశలో క్యాన్సర్ ను గుర్తిస్తే నివారణ సులభం అన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం అని చెప్పారు.
ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మణిపాల్ ఆసుపత్రి క్యాన్సర్ వైద్యులు డా. భవాని, డా. శ్రీదివ్య లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారిణి డా. సల్మా, డా. శేషా రెడ్డి, విద్యార్ధులు పాల్గొన్నారు.
Comments
Post a Comment