Skip to main content

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేసేవరకు పోరాడతాం - సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు. వై నరసింహారావు

మచిలీపట్నం :

         కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారీ వర్గాలకు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సీఐటీయూ కృష్ణా జిల్లా ఉపాధ్యా క్షులు వై నరసింహారావు పేర్కొన్నారు. అఖిల భారత సార్వత్రిక సమ్మె లో భాగంగా మచిలీపట్నం బస్టాండ్ దగ్గర నుంచి కోనేరు సెంటర్ వరకు భారీ ప్రదర్శన, ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.

        ఈ సందర్భంగా వైయన్ మాట్లాడుతూ కార్మికవర్గం నేడు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వలస కాలంనాటి పని పరిస్థతులను తిరిగి ప్రవేశపెట్టడానికి మన పాలకులు ఉబలాట పడుతున్నారని విమర్శించారు. 8 గంటల పనిదినం అమలుచెయ్యాలని నెల రోజులపాటు సమ్మె చేసిన చరిత్ర భారత కార్మికవర్గానికి వుందని తెలిపారు. 1926లోనే ట్రేడ్ యూనియన్ చట్టాన్ని, నిరసన తెలియజేసే హక్కు, సంఘటితపడే హక్కును సాధించుకున్నారన్నారని గుర్తు చేశారు. 


       అనేక పోరాటాలు చేసి కనీస వేతనచట్టం తో పాటు 44 కార్మిక చట్టాలను సాధించుకున్నారని తెలిపారు. చరిత్రలో జరిగిన అనేక పరిణామల వలన వర్గ పోరాటాలను బలహీనపరిచే అనేక సిద్ధాంతాలు, ఆచరణలు కార్మికులను వర్గ పోరాటాలనుండి దారి మళ్ళించాయని పేర్కొన్నారు. కనీస వేతన చట్టం ఎక్కడా అమలుజరగడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్ట్ తీర్పులున్నా, ఎక్కడా అమలుకావడం లేదని విమర్శించారు. 

          వేతనాల చెల్లింపు చట్టం ప్రకారం జీతం చెల్లించవలసిన తేదీ కంటే ఆలస్యమైతే వడ్డీతోసహా చెల్లించాలని ఉందని, ప్రభుత్వాలు ఆ నిబంధనను అమలు చేయడం లేదని విమర్శించారు. 4 లేబర్ కోడ్లు అమలులోకి రాకముందే ప్రయివేట్ పరిశ్రమల్లో 10 గంటల పనిదినంగా స్థిరపడిపోయిందన్నారు. పెరిగిన పని గంటలకు అదనపు వేతనం ఇవ్వడంలేదని పేర్కొన్నారు. పని ప్రదేశాలలో జరిగే ప్రమాదాలలో, ప్రమాదకర పని ప్రదేశాలలో పనిచేస్తూ వేలాదిమంది కార్మికులు, ముఖ్యంగా అసంఘటిత రంగ వలస కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. 

          కార్మికులకు, ఇపిఎఫ్ 95 వంటి స్కీముల పేర నామమాత్ర పెన్షన్లు ఇస్తూ దేశానికి ఉత్పత్తులు అందించిన కార్మికుల పట్ల ప్రభుత్వాలు అమానవీయంగా ఉంటున్నాయని విమర్శించారు. అన్ని రంగాలలోనూ సంస్కరణలు చేసినట్లే లేబర్ సంస్కరణలు కూడా అమలు చెయ్యాలని, పెట్టుబడి వర్గాలు, బహుళజాతి కంపెనీలు ప్రభుత్వాన్ని ఎప్పటినుండో కోరుతున్నాయన్నారు. దోపిడికి గురవుతున్న కార్మిక వర్గం, రైతు కూలీలు, గిరిజనులు ఏకమై శ్రామిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. 

         మున్సిపల్ కార్మికులు, ముఠా కార్మికులు, ఆశా కార్యకర్తలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రిసోర్స్ పర్సన్లు, అంగన్వాడి కార్యకర్తలు, బ్యాంకు ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు, నాయకులు భారీ ర్యాలీ లో ఎర్రజెండాలు చేతబడి మచిలీపట్నం వీధుల వెంబడి కదం తొక్కారు.

         ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్యకారుల సంఘం కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగత రమాదేవి, రైతు కూలి సంఘం నాయకులు వీరబాబు, ఆశ వర్కర్ల సంఘం నాయకురాలు కృపా జయ, మెప్మా ఆర్పీల సంఘం నాయకురాలు కె మాధవి, జీవిత బీమా ఉద్యోగుల సంఘం డివిజన్ కార్యదర్శి జి కిషోర్ కుమార్, ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకురాలు వాణి, వెలుగు బుక్ కీపర్ల సంఘం నాయకురాలు రత్నకుమారి,సీఐటీయూ జిల్లా కార్యదర్శి బూర. సుబ్రహ్మణ్యం, సిపిఎం సీనియర్ నాయకులు కొడాలి శర్మ, ఐద్వా మచిలీపట్నం కార్యదర్శి కొడాలి సుజాత, సిఐటియు మచిలీపట్నం కన్వీనర్ చిరువోలు జయరావు, వికలాంగుల హక్కుల వేదిక నాయకులు నాగనబోయిన సత్యనారాయణ, సిపిఐ నాయకులు మోదమూడి రామారావు, ఏఐటియుసి నాయకులు లింగం ఫిలిప్, ఒంటి పులి లక్ష్మణరావు, ఎర్రంశెట్టి ఈశ్వరరావు తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...