Skip to main content

కలెక్టరేట్లో ఉద్యోగులకు సంబంధించి 25 అర్జీలు, ప్రజల నుండి 112 అర్జీలు



మచిలీపట్నం:

ప్రజల నుండి అందే మీకోసం అర్జీల పట్ల అత్యధిక ప్రాధాన్యత నిచ్చి సానుకూలంగా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, డీఎస్పీ శ్రీనివాసరావు లతో కలసి తొలుత ఉద్యోగుల గ్రీవెన్స్ డే నిర్వహించి వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల నుండి అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులు సకాలంలో పరిష్కరించాలని సూచించారు. 
అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక.... మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. 
ఆ ప్రకారం కలెక్టరేట్లో ఉద్యోగులకు సంబంధించి 25 అర్జీలు అందగా, ప్రజల నుండి మొత్తం 112 అర్జీలు అందాయి. వాటిలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:

గూడూరు మండలం రామరాజుపాలెం గ్రామస్తురాలు గుడిసె చిన్ని తన భర్త నాంచారయ్య 2023 సంవత్సరంలో చనిపోయారని తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయవలసినదిగా కోరుతూ అర్జీ అందజేశారు.

మండల పరిషత్తు ఉప మండల పరిషత్తు కార్యాలయాల్లో అభివృద్ధి కార్యాలయాల్లో పనిచేస్తున్న మండల స్థాయి కంప్యూటర్ ఆపరేటర్లు తమకు గతం ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని కోరుతూ పంచాయతీరాజ్ మండల స్థాయి కంప్యూటర్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు సంయుక్త కార్యదర్శి సౌమ్య తదితరులు కలెక్టర్కు అర్జీ అందజేశారు

ఉయ్యూరు మండలం కాటూరు గ్రామానికి చెందిన జి మస్తాన్ రావు తాను దివ్యాంగుడినని, కన్ను పోయిందని ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని సదరం సర్టిఫికెట్ కు వెళ్తే టెంపరరీ అని రాశారని తనకు వికలాంగుల పింఛను మంజూరు చేయవలసిందిగా కోరుతూ అర్జీ అందజేశారు.

గుడివాడ మల్లయ్య పాలెం ఒకటవ సచివాలయం పరిధిలో శ్రీకాళహస్తీశ్వర కాలనీలో నివసిస్తున్న బసవ కుమారి తనకు బాల్యం నుండి ఎడమ కన్ను పూర్తిగా కనపడదని దీర్ఘకాలంగా గుడ్డి కన్నుతో బాధపడుతున్నానని ఏ పని చేయలేకపోతున్నాను అని తనకు వికలాంగుల పింఛను ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలని కోరుతూ అర్జీ అందజేసింది.


అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ మండల స్థాయిలో ఎవరైనా అధికారులు సరిగా పనితీరు కనబరచకపోతే అటువంటి వారిని ప్రతి సోమవారం మధ్యాహ్నం తన వద్దకు తీసుకొని రావాలని జిల్లా అధికారులకు సూచించారు. 
జనాభా లెక్కల సేకరణ ఏప్రిల్ నెలలో ప్రారంభం కానున్న దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం మొత్తం అత్యధిక ప్రాధాన్యతతో ఆ ప్రక్రియ చేయవలసి ఉంటుందని, ముఖ్యంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా నియమించిన సిబ్బంది ఎవరికి ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి ఇంటింటి జాబితా సేకరణ చేపట్టవలసి ఉంటుందన్నారు.
ఇంకా ఒక నెల ఉన్నందున ఏ ఇంటికైనా నంబర్లు కేటాయించకపోతే వెంటనే ఆ ఇంటికి సంబంధించి అసెస్మెంట్ తయారు చేసి నంబర్లు కేటాయించాలన్నారు. 

 ఇంకా క్లెయిమ్ చేయని బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఈ కేవైసీ లను వెంటనే అందజేసి ఆ ఖాతాలు చురుకుగా పనిచేసే విధంగా సిద్ధం చేయాలని ఆదేశించారు.

సమాచార హక్కు చట్టం కింద ఇకపై అర్జీదారులకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవడం, సమాధానం పంపడం వంటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో ఆర్టిఐ నోడల్ అధికారిగా డిఆర్ఓ వ్యవహరిస్తారన్నారు. ప్రజా సమాచార అధికారులు నిర్ణీత గడువు 30 రోజుల్లోగా సమాధానం అర్జీదారులకు పంపాల్సి ఉంటుందన్నారు. 

మీకోసం అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఇంకా కొందరు అధికారులు పాత పద్ధతిలోనే అర్జిదారుడు ప్రయోజనం పొందినట్లు చూపడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరో రెండు రోజుల్లో కలెక్టరేట్ లో మంచి నీటి సీసాల యూనిట్ను ఏర్పాటు చేయబోతున్నామని, అందరికీ కావలసిన గాజు సీసాలతో మంచినీటిని సరఫరా చేస్తామన్నారు. ఆ తదుపరి కలెక్టరేట్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ సీసాలు కనిపించరాదని హెచ్చరించారు.

నగరంలోని సత్యసాయి సేవా సమితి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతి సోమవారము కలెక్టరేట్లో జరిగే మీకోసం కార్యక్రమానికి వచ్చిన అధికారులు, ప్రజలకు ఉచితంగా అల్పాహారం అందజేయడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వచ్ఛంద కార్యకర్తలు సాయి కృష్ణ, నరేంద్ర, సాయిబాబు, మణికంఠలను శాలువులతో ఘనంగా సత్కరించారు.

జిల్లాలో పింఛనుదారులకు సంబంధించి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గత రెండు సంవత్సరాలుగా 1500 దాకా వైద్య ఖర్చుల బిల్లులు పరిష్కారం కాక పెండింగ్లో ఉండడంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని వాటిని ఒక వారంలోగా పరిష్కరించినందుకు జిల్లా పింఛన్దారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జి రామస్వామి నేతృత్వంలో పింఛన్దారులందరూ హర్షం వ్యక్తం చేస్తూ, జిల్లా కలెక్టర్ ను, సంయుక్త కలెక్టర్ ను, డిఆర్ఓ ను శాలువలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.




ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, డ్వామా 
డి ఆర్ డి ఏ పిడీలు శివప్రసాద్, హరిహరనాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, డిపిఓ డాక్టర్ జే అరుణ, ఆర్ అండ్ బి ఈ ఈ లోకేష్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు, పౌరసరఫరాల సంస్థ డిఎం శివరాం ప్రసాద్, సర్వే భూ రికార్డుల ఏడి లక్ష్మణ్ తదితర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...