Skip to main content

కృష్ణా జిల్లాలో గుర్రపు డెక్కతో హ్యాండ్లూమ్స్



        చెరువుల్లో, కాలువలలో విపరీతంగా గుర్రపు డెక్క (Water Hyacinth)  మొక్క పెరుగుతుంది అనీ, ఇది పనికిరాని మొక్క అనీ భావిస్తారు. కానీ దీని కాడలతో అద్భుతమైన కళాకృతులను, గృహోపకరణాలను తయారు చేయవచ్చు అని మీకు తెలుసా? ఇది పర్యావరణ హితమైనది (Eco-friendly) కూడా!

         దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదీ తీరం దీని జన్మ స్థానం. మన దేశానికి ఇది బ్రిటీష్ వారి కాలంలో ఒక అలంకార మొక్కగా తీసుకురాబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగే మొక్కలలో ఒకటి. కేవలం రెండు వారాల్లోనే ఇది రెట్టింపు విస్తీర్ణానికి వ్యాపిస్తుంది. దీని కాడలు గాలితో నిండి ఉబ్బి ఉండటం వల్ల ఇది నీటిపై తేలుతూ, గాలికి లేదా నీటి ప్రవాహానికి ఒక చోటు నుండి మరొక చోటుకి సులభంగా వ్యాపిస్తుంది.
        ఇక విషయానికి వస్తే, గుర్రపు డెక్కని చెత్త  అని తీసి పార వేయకుండా, దీని కాడలతో పలు రకాల గృహోపకరణాలు (Home Decor) తయారు చేయవచ్చు. బుట్టలు (Baskets), మ్యాట్లు (Mats), గోడ అలంకరణలు (Wall Hangings), ఫ్యాషన్ వస్తువులు (Fashion Accessories), చేతి బ్యాగులు (Handbags), చెప్పులు (Footwear), టోపీలు (Hats), స్టేషనరీ (Handmade Paper), పూలకుండీలు(Planters) వంటివి గుర్రపు డెక్కతో చేయగలిగే కొన్ని ముఖ్యమైన కళాకృతులు.

తయారీ విధానం
       చెరువుల నుండి గుర్రపు డెక్క మొక్కలను సేకరించాలి. ఆకులు, కాడలను వేరు చేసి, ఎండలో బాగా ఎండబెట్టాలి. అప్పుడు అవి బంగారు రంగులోకి మారి గట్టిగా తయారవుతాయి. ఎండిన కాడలను తేమ చేసి, వాటిని మెలితిప్పి నారలా మార్చుకోవాలి. ఈ నారతో కావాల్సిన వస్తువులను అల్లుకోవాలి. చివరగా మెరుపు కోసం మరియు ఎక్కువ కాలం మన్నడానికి వార్నిష్ పూయవచ్చు.
గుర్రపు డెక్కను "వేస్ట్" అని పారేయకుండా, ఇలాంటి కళాకృతులు చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు, గ్రామీణ ఉపాధిని పెంపొందించవచ్చు.

కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చొరవ

       కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో గుర్రపు డెక్క కాడలతో హ్యాండ్లూమ్స్ తయారీ ని కృష్ణా జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ గమనించారు. ఆయన పట్టుదల వల్ల అస్సాం, మేఘాలయకు మాత్రమే పరిమితమైన కళాకృతులకు, పర్యావరణ హిత సంపదకు.. ఆంధ్రప్రదేశ్ లో మొదటి సారిగా కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామం లో బీజం  పడింది. 
       కృష్ణా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డిఆర్డిఏ) ఆధ్వర్యంలో చిన్నాపురం గ్రామంలో మొదటి విడతగా 30 మంది మహిళలను ఎంపిక చేసి లేపాక్షి సౌజన్యంతో గుర్రపు డెక్క కాడలతో  హ్యాండ్లూమ్స్ తయారీపై నాలుగు నెలల పాటు శిక్షణ ఇప్పించారు. రెండవ విడతలో మరో 30 మంది మహిళలకు శిక్షణ ఇప్పించారు. రెండు గ్రూపులకూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(NID) నెల రోజుల పాటు గుర్రపు డెక్క తో హస్తకళలు చేయడంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. 
       ప్రభుత్వం శిక్షణ పూర్తి చేసిన సభ్యులను హయలూమ్ సొసైటీ గా రిజిస్టర్ చేసింది. దాంతో సొసైటీ లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ కోఆర్డినేషన్ తో లేపాక్షి సంస్థకు పది లక్షల విలువైన పలు ఉపకరణాల ఆర్డర్ పొందింది. అంతే కాకుండా కలెక్టర్ కార్యాలయం యాభై వేల రూపాయల విలువైన ఆర్డర్ ఇచ్చి ప్రోత్సహించింది.
      కాలువ నీటి ప్రవాహానికి ఇబ్బందిగా మారిన గుర్రపు డెక్క  తొలగింపుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో ఖర్చు పెడుతుంది. అదే కలుపు మొక్క గుర్రపు డెక్కతో గ్రామీణ మహిళలను కలిపి  స్వయం ఉపాధి కల్పించి, వ్యాపారవేత్తలుగా ముందుకు నడిపిస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి  శుభాభినందనలు.

శ్యామ్ కాగిత,
మచిలీపట్నం

https://youtu.be/QyWAVx8q7p0?si=yyCILgEeLVn4lZo4

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...