Skip to main content

క్రమశిక్షణ, పట్టుదలతో మంచి మార్కులు సాధించాలి..... జిల్లా కలెక్టరు డీకే బాలాజీ


మచిలీపట్నం :

పదవ తరగతి విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, శ్రద్ధతో చదువుకొని పదో తరగతి పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు.

శనివారం సాయంత్రం నగరంలోని పోలీస్ కళ్యాణమండపంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాల ఆధ్వర్యంలో మచిలీపట్నం నగరంలోని పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణాత్మక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించారు.
అంతకు మునుపు జిల్లా కలెక్టర్ యధావిధిగా సైకిల్ పై కలెక్టర్ కార్యాలయం నుండి బయలుదేరి పోలీసు కళ్యాణ మండపానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల, శ్రద్ధతో పదవ తరగతి పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలన్నారు.

తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ
తాను 9వ తరగతి వరకు చదివిన తీరు, ఆ తదుపరి పదవ తరగతి నుండి చదివిన తీరు వేరని అన్నారు. పదవ తరగతిలో చాలా పోటీ వాతావరణం ఉండేదని, తాను పదవ తరగతిలో చదివిన చదివే జీవితంలో ఎంతో ఉపయోగపడిందని, ఐఏఎస్ కాగలిగాననీ విశదీకరించారు.

చదువుకున్న సబ్జెక్టులను ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉంటే సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చన్నారు. 

అంతేకాకుండా పరీక్షలు వేగంగా, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, మంచి కస్తూరి తో వ్రాయాలన్నారు. అప్పుడే మంచి మార్కులు పడతాయన్నారు.
ప్రస్తుతం మంచి బ్రాండ్లతో వెలుగొందుతున్న సంస్థలన్నీ ఒకప్పుడు వాటి యజమానులు అందరూ ఒకప్పుడు ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారే అని అన్నారు 

ముఖ్యంగా సైకిల్ బ్రాండ్ నారాయణరావు, రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ పేదరికం నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన తీరు విద్యార్థులకు వివరించారు.
క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మొదట్లో ఎలా పట్టుదలగా ఆడేవారు ఎంతగా శ్రమించేవారు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో తెలియచెప్పారు.

ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచనలు గొప్పగా ఉండాలని అందుకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం అలవాట్లు మార్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.

క్రమశిక్షణ, మంచి అలవాట్లు ఉంటే జీవితంలో ఏమైనా సాధించవచ్చని హితవు పలికారు.
విద్యార్థులందరూ చరవాణికి దూరంగా ఉండాలని, మెదడు బాగా పనిచేయాలంటే సరిగా ఆహారం తీసుకోవాలని రాత్రిపూట 7 నుంచి 8 గంటలు బాగా నిద్ర పోవాలని
అన్నారు.

 అనంతరం నగరంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన టాలెంట్ టెస్ట్ పోటీలలో విజేతలైన వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి యు వి సుబ్బారావు, ప్రైవేట్ పాఠశాలల సంఘాల అధ్యక్షులు కే వి జోన్, సన్ స్టార్ పాఠశాల అధినేత శ్రీరామ్, పలు ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, యాజమాన్య సంఘాల నాయకులు, విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...