Skip to main content

గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం



మచిలీపట్నంలో రూ. 39 కోట్ల విలువైన రహదారుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పలు రహదారుల అభివృద్ధికి శంకుస్థాపనలు చేసిన మంత్రి

మచిలీపట్నం :

గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

బుధవారం ఉదయం మచిలీపట్నం నియోజకవర్గంలోని రూ. 33 కోట్ల నిధులతో మచిలీపట్టణం - కమ్మవారి చెరువు వయా చిన్నాపురం రెండు వరుసల ఆర్ అండ్ బి రహదారి విస్తరణ పనులు, అదేవిధంగా రూ. 6 కోట్లతో మచిలీపట్టణం శివగంగ దేవాలయం దగ్గర నుండి చిన్నాపురం వరకు రోడ్డు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, కాలేఖాన్ పేట, చిన్నాపురంలో రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మొత్తం రూ.39 విలువైన రహదారుల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు.
అనంతరం కాలేఖాన్ పేట, చిన్నాపురంలో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమం ద్వారా, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.3,300 కోట్లు మంజూరు చేసి ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా రహదారులను అభివృద్ధి చేశామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గానికి దాదాపు రూ.30 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామని, మిగిలిన రహదారుల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేసి సహకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న స్వేచ్ఛ వాణిజ్యం, రాయితీలను మెచ్చి రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. త్వరలో మచిలీపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గతంలో కాలేఖాన్ పేట నుంచి చిన్నాపురం వరకు ఏక వరుసతో ఉన్న రహదారిని రూ.10 కోట్లు వెచ్చించి రెండు వరుసల రహదారిగా అభివృద్ధి చేశామని, దానితోపాటు రూ.30 కోట్ల వ్యయంతో గుండేరుపై ఒకటి, గుండుపాలెం వద్ద మరొకటి మొత్తం రెండు వంతెనలు నిర్మించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాడు ఆ రహదారులను రూ.10 కోట్లతో అభివృద్ధి చేశామని, అయితే నేడు మరో రూ.6 కోట్ల నిధులను వెచ్చించి రహదారుల విస్తరించి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. అదేవిధంగా గత టిడిపి ప్రభుత్వ హాయం 2014–19 కాలంలో రూ.60 కోట్ల వ్యయంతో ఉల్లిపాలెం బ్రిడ్జి నిర్మించామని చెబుతూ, చిన్నాపురం నుంచి కమ్మవారి చెరువు వరకు దాదాపు రూ.33 కోట్ల వ్యాయంతో రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గానికి ఆర్ అండ్ బి నుంచి దాదాపు రూ.46 కోట్ల నిధులు మంజూరు చేసి సహకరించారని మంత్రి అభినందించారు. 216 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా లోసరి వంతెన నుంచి కానూరు, మంగినపూడి, గిలకలదిండి, పోలాటితిప్ప, వాడపాలెం, కోడూరు వంటి తీర ప్రాంతాల వెంబడి నిజాంపట్నం వరకు అభివృద్ధి చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయటం అభినందనీయమన్నారు. 
  
ఈ సందర్భంగా మచిలీపట్నం విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి చిన్నాపురంలో సంక్రాంతి వేడుకలు పురస్కరించుకుని గ్రామస్తులు గంగిరెద్దులతో ఆత్మీయ స్వాగతం పలికారు. చిన్నాపురంలోని శ్రీ వెంకటచలస్వామి దేవాలయానికి విచ్చేసిమంత్రులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు చీఫ్ ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ శ్రీనివాస్ రెడ్డి, రహదారులు భవనాలు ఎస్ఈ (విజయవాడ) భాస్కరరావు, ఈఈ లోకేష్ రావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ లంకె నారాయణ ప్రసాద్, జనసేన పార్టీ నేత బండ్రెడ్డి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావు, కూటమి నాయకులు బచ్చుల అనీల్, మధుసూదనరావు, సోమశేఖర్, ఇలియాస్ భాష తదితర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...