మచిలీపట్నం:
మొదటి తరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న 219 వ జయంతిని మచిలీపట్నం బలరాముల పేటలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వడ్డే ఓబన్న కీర్తిని కొనియాడారు...
మొదటిగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు...
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గోపీచంద్, జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ, మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ కౌన్సిలర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, మచిలీపట్నం టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లోగిశెట్టి స్వామి, బండారు నాని, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్, వేముల దుర్గారావు, బత్తుల దుర్గాప్రసాద్, వేముల రాజేష్, శివరాత్రి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment