Skip to main content

చంద్రబాబు నాయుడు పై విరుచుకుపడ్డ పేర్ని నాని



రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ విజయం తథ్యం 

మచిలీపట్నం :

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పై కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. మచిలీపట్నం సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్ని వెంకట్రామయ్య మాట్లాడుతూ హైదరాబాద్ భోగాపురం ఎయిర్పోర్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టినట్లు ఫోటోలు దిగటం సిగ్గుచేటు అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వలనే ఇండిగో విమానాల విషయంలో భారతదేశం ప్రపంచ దేశాల ముందు తలదించుకుందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు చంద్రబాబు నాయుడు కు సంబంధం లేదని అన్నారు. 2014 - 19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం 5000 ఎకరాలు కావాలని రైతుల వద్ద నుండి లాక్కోవాలని చూసిన ద్రోహి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2200 ఎకరాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ కు భూ సేకరణ చేసి నిర్మించామని అన్నారు. వైజాగ్ పోర్ట్ నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ కి 6600 కోట్లతో సిక్స్ లైన్స్ జాతీయ రహదారి మంజూరు చేస్తున్నట్లు మంత్రి గడ్కరీ గతంలో ప్రకటించాడు. దీనికి కారణం జగన్ కాదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సరిగా అందడం లేదని విమర్శించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగే అధికారం లేదన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి వేయటానికి చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నారన్నారు.

2024 ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు జగన్ పెంచారని విమర్శించి, మీటర్ల బద్దలు కొట్టమని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే మీటర్లను బిగిస్తున్నారు ఎందుకో ప్రజలకు చెప్పాలన్నారు. వాలంటర్ల కు 10వేలు ఇస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుతం వాలంటీర్లు లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.

మెడికల్ కాలేజ్ లు ఎకరం భూమి రూపాయి కి, హాస్పిటల్ ఫ్రీ అని రెండేళ్లు డాక్టర్లు జీతాలు ఇస్తామని ప్రకటించిన ఒక్కరు కూడా టెండర్లను వేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదో ప్రజలకు తెలుసు అన్నారు. విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కిమ్స్ ఆస్పత్రిలో ఉన్న ప్రేమ్ చాంద్ షా కి ఆదోని మెడికల్ కాలేజ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న కిమ్స్ ఆసుపత్రిలో చాంద్ షా అనే వ్యక్తి లేరు. చంద్రబాబు నాయుడుకి దమ్ము ధైర్యం ఉంటే కిమ్స్ ఆస్పత్రికి ఉన్న సంబంధాలే అధికార పూర్వకంగా తెలియజేయగలరా అని సవాలు విసిరారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదన్నారు. వైఎస్సార్ సీపీ వాళ్లపై కక్ష సాధించడానికి పోలీసులకు మాత్రమే ఒకటో తేదీన జీతాలు పడుతున్నాయి అని ఇంకెవరికి పదో తారీకు లోపు జీతాలు పడిన దాఖలాలు లేవని పేర్ని ఎద్దేవా చేశారు. పోలీసులకు ఒక్క సరెండర్ లీవ్ అయినా కూటమి ప్రభుత్వం ఇచ్చారా? సంవత్సరం లో మూడు సార్లు సరెండర్ లీవ్ లు వేయాలి కాదా? ఎందుకు వేయడం లేదు అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ దిగజారిపోతుందని కేంద్రం చెప్పటంలో ఆంతర్యం ఏమిటో చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు అన్నారు. ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చంద్రబాబు పై సహాయ నిరాకరణ చేయడం తద్యమని అన్నారు. హోం గార్డులను కానిస్టేబులుగా మార్చుతామని వాగ్దానం ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఎందుకు చేయడం లేదు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. చంద్రబాబు చరిత్ర అసత్యాలు, బురిడీలు, మాయమాటలు చెప్పడమేనని అన్నారు.

రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవిని చేపడతారని పేర్ని నాని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసేసామని చంద్రమనాయుడు చెపుతున్నారు అని ఇప్పుడే కాదు ఇంకెప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డిని అనగాతొక్కడం సాధ్యపడే విషయం కాదని అన్నారు. ఇప్పటికే తెలుగుదేశం అన్ని విధాలుగా అప్రతిష్ట పాలయ్యిందని అన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...