Skip to main content

జిల్లా కలెక్టర్ గుడ్లవల్లేరు మండలం, పెడన నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల సందర్శన



మచిలీపట్నం:

        క్రమశిక్షణ, శ్రద్ధతో బాగా చదువుకొని పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో విజయం సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు.

      బుధవారం జిల్లా కలెక్టర్ గుడివాడ నియోజక వర్గం గుడ్లవల్లేరు మండలం, పెడన నియోజకవర్గ కేంద్రంలో పర్యటించి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సమాయత్తం చేశారు. అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రతిభ పాటవాలను పరీక్షించారు.
        తొలుత జిల్లా కలెక్టర్ గుడ్లవల్లేరు మండలంలోని వడ్లమన్నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఇక పదవ తరగతి పరీక్షలకు 46 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, అలోగా క్రమశిక్షణ,శ్రద్ధతో చదివితే పరీక్షల్లో మంచి మార్కులతో విజయం సాధించవచ్చన్నారు . 

        ఏ సబ్జెక్టు బాగా నేర్చుకోగలిగాము, ఏ సబ్జెక్టు ఇంకా బాగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నదో విద్యార్థులు వారికి వారే అంచనా వేసుకోవాలన్నారు.
తెల్లవారుజాముననే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆ సమయంలో కొన్ని గంటలు కేటాయించి శ్రద్ధగా చదువుకునే అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు
మిగిలిన సమయాల్లో వివిధ రకాల ఆలోచనలతో సరిగా చదువుకునే పరిస్థితి ఉండదన్నారు.
పదవ తరగతిలో క్రమశిక్షణతో సీరియస్ గా చదివే అలవాటు చేసుకుంటే అది జీవితాంతం ఉంటుందని తద్వారా ఉన్నత ఏరంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం లభిస్తుందన్నారు.
      రానున్న ఒకటిన్నర నెల రోజులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు.


        తదుపరి పెడన మున్సిపల్ పరిధిలోనీ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించి ఉపాధ్యాయులుగా మారి కూడికలు, తీసివేతలు ఎంతమేరకు చేయగలుగుతున్నారో స్వయంగా పరీక్షించారు.

        అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఎలా బోధించాలి అనే విషయాలపై ఉపాధ్యాయులకు విశదీకరించారు.
       వడ్లమన్నాడు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలును పరిశీలించి విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. 


        తదనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఫౌండేషనల్ లీటరసి న్యూమరసి(ఎఫ్ ఎల్ ఎన్) కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
 
       ఇందుకోసం ప్రాథమిక పాఠశాలలో న్యూమరసి బేసిక్స్ ఎంతవరకు అమలు అవుతుందో పరిశీలించడం జరుగుతుందన్నారు.
       అలాగే ఉన్నత పాఠశాలలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలను బాగా వ్రాసేందుకు వీలుగా నూరు రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. 

        ఇందులో ఇప్పటికే 54 రోజులు గడిచిపోయాయన్నారు. ఇప్పటివరకు విద్యార్థులు ఏమాత్రం సబ్జెక్టులు నేర్చుకున్నారో పరీక్షలు ఏ విధంగా తయారవుతున్నారు గమనించేందుకు పాఠశాలలను సందర్శిస్తున్నామన్నారు.

        ప్రతి పాఠశాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని వారు ఏ విద్యార్థికి ఏ సబ్జెక్టులో సహాయం కావాలో తెలుసుకుని ఆ సహాయం అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. అంతే కాకుండా ప్రతి విద్యార్థికి ఉపయోగపడే విధంగా ప్రత్యేకించి స్టడీ మెటీరియల్ అన్ని పాఠశాలలకు అందజేశామన్నారు. క్రమం తప్పకుండా స్లిప్ టెస్టులను నిర్వహిస్తున్నామని, నూటికి నూరు శాతం విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని సాధించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. 
        ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డి ఈ ఓ సుబ్బారావు, స్థానిక ఎంఈవోలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. .

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...