Skip to main content

పేదరికం లేని సమాజ నిర్మాణమే ధ్యేయం... జిల్లా కలెక్టర్



గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం. 

మచిలీపట్నం :

స్వర్ణాంధ్ర 20047లో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పేదరికం లేని సమాజం నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. 
77వ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సోమవారం మచిలీపట్నం పోలీసు కవత్తు మైదానంలో జిల్లా యంత్రాంగం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందన స్వీకరించారు జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి కలెక్టర్ స్వేచ్ఛ స్వతంత్రాలకు ప్రత్యేకంగా గాలిలోకి బిల్లులను ఎగురవేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసంగిస్తూ ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగా దేశానికి స్వతంత్రం సిద్ధించిందన్నారు 1950వ సంవత్సరం జనవరి 26న గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందన్నారు స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వ లక్ష్య సాధనకై జిల్లాలో రాబోయే ఐదేళ్లలో అన్ని రంగాలలో కనీసం 15% వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది అన్నారు స్వర్ణాంధ్ర 20047లో భాగంగా పేదరికం లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటు ప్రజల భాగస్వామ్యంతో పి ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని సమాజంలో 10 శాతం మంది ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేద ప్రజల అభ్యున్నతికి తోడ్పడాలంటే ప్రభుత్వ లక్షణం అన్నారు ఇందులో భాగంగా జిల్లాలో 78,866 పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించడం జరిగినది వీరికి ఇప్పటివరకు 43,496 బంగారు కుటుంబాలను 2865 మంది మార్గదర్శకులు దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు. 
వ్యవసాయ శాఖ ద్వారా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా 1,33856 రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రెండు విడతల్లో 1,33.86 కోట్లు పిఎం కిసాన్ పథకం కింద 44.23 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. సాగు ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించే దిశగా ఆధునిక వ్యవసాయ సాంకేతిక విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు వ్యవసాయ డ్రోన్లపై శిక్షణ నించి 80 శాతం సబ్సిడీలతో 29 డ్రోన్లను రైతు గ్రూపులకు 2.27 కోట్ల రాయితీలను అందించామన్నారు రైతన్న మీకోసం పేరుతో గత నవంబర్లో రైతు సేవ కేంద్రం పరిధిలోని రైతుల ఇంటింటికి తిరిగి లాభసాటి వ్యవసాయానికి గాను పంచు సూత్రాలను వివరించి మూడు సీజన్లకు వ్యవసాయ కార్యచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. మత్స్యకారుల సేవలో పథకం కింద జిల్లాలో 13,077 మంది మత్స్యకారులకు చేపల వేట నిషేధ మృతిని ఒక్కొక్కరికి 20వేల చొప్పున 26.15 కోట్లను వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేశామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 421. 17 కోట్లతో సాగరమాల ఫేస్ 2 కింద చేపట్టిన ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులు ఇప్పటివరకు 80 శాతం పూర్తయ్యాయని 2026 మార్చినాటికి అందుబాటులోకి రాని ఉందని తద్వారా 3,300 మంది మత్స్యకారులకు ఉపాధి లభించనుందన్నారు.
ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక కింద 2025 26 ఆర్థిక సంవత్సరానికి 876 మంది లబ్ధిదారులకు 35.27 కోట్ల సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం జరిగిందని అదేవిధంగా ఉచిత విద్యుత్ పథకం కింద 202526 సంవత్సరం నందు 200 లోపు ఈట్లు ఖర్చు చేసి 47,691 మంది లబ్ధిదారులకు 5.46 కోట్లను చెల్లించడం జరిగిందని వివరించారు. 
ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద ఒకటి 1150 కోట్లతో 63,898 గృహాలు మంజూరు కాగా అందులో ఇప్పటివరకు 33 801 గృహాల నిర్మాణం పూర్తయి 30, 097 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.
ప్రజా రవాణా ద్వారా స్త్రీ శక్తి పథకం కింద జిల్లాలో ఐదు డిపోల పరిధిలో ఎక్స్ప్రెస్ అల్ట్రా పల్లె వెలుగు పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ లో సిటీ ఆర్డినరీ బస్సులలో ఇప్పటివరకు ఒకటి పై 49 కోట్లమంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా వారిలో 48.48 కోట్ల మేర లబ్ధి చేకూరింది అన్నారు అదే విధంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద జిల్లాలో 1262 మంది ఆటో మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ వాహనదారులకు 16.97 కోట్ల లబ్ధి పొందినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇంకా పలు అంశాలను సుదీర్ఘంగా ప్రసంగించారు. జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరు సహకారంతో ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ పర్శిన్ జాహీద్, డిఆర్ఓ చంద్రశేఖర రావు కేఆర్ఆర్సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి ఏఎస్పి సత్యనారాయణ బందరు, గుడివాడ ,ఉయ్యూరు ఆర్డీవోలు పోతురాజు, బాలసుబ్రమణ్యం సాహరోన్, కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి కే. రాంజీ, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, కలెక్టర్ రేట్ ఏవో రాధిక ,వివిధ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...