Skip to main content

కేడీసీసీ బ్యాంక్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

మచిలీపట్నం :

            దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మచిలీపట్నంలోని కేడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ హాజరై వేడుకలకు విశిష్టతను చేకూర్చారు. కార్యక్రమ ప్రారంభంలో నెట్టెం రఘురామ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, హాజరైన అధికారులు, సిబ్బంది సమూహంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం గౌరవ వందనం ను చేశారు. జాతీయ జెండా రెపరెపలాడుతుండగా ప్రాంగణమంతా దేశభక్తి నినాదాలతో మార్మోగింది.

             ఈ సందర్భంగా జరిగిన సభలో నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశానికి ఇచ్చిన ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులు బాధ్యతల ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.దేశ స్వాతంత్ర్యం, జాతీయ సమగ్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. యువత దేశ భవిష్యత్తు అని, క్రమశిక్షణ, కఠిన శ్రమ, దేశభక్తి, సేవాభావం కలిగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. బ్యాంకింగ్ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి పునాది అని, కేడీసీసీ బ్యాంక్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆర్థిక సేవలు అందిస్తూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసమే బ్యాంక్ బలమని, పారదర్శకత, సేవాభావం, బాధ్యతాయుత విధానాలతో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈవో శ్యామ్ మనోహర్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ అలాగే కేడీసీసీ బ్యాంక్ ఉద్యోగులు కూడా హాజరై కార్యక్రమ విజయవంతానికి తమ వంతు సహకారం అందించారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...