Skip to main content

నా భారతదేశం నా ఓటు



మచిలీపట్నం :

        ఓటు చాలా విలువైన ఆయుధమని, దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు.

         జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం ఉదయం నగరంలోని లక్ష్మీ టాకీస్ కూడలి నుండి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా మరల లక్ష్మి టాకీస్ కు చేరుకునే విధంగా తొలుత పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించి స్వయంగా సైకిల్ తొక్కారు. అనంతరం జిల్లా కలెక్టర్ లక్ష్మి టాకీస్ కూడలి నుండి జడ్పీకన్వెన్షన్ హాల్ వరకు కాలినడగన నా భారతదేశం నా ఓటు అనే నినాదంతో పచ్చ జెండా ఊపి ర్యాలీనీ నిర్వహించారు. 
          ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం 1950 సంవత్సరం జనవరి 25వ తేదీన ఆవిర్భవించిందని,  అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం అదే రోజున జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.

      మనకు 1947లో స్వాతంత్రం వచ్చాక చాలామంది దేశంలో ప్రజాస్వామ్యానికి మనుగద  లేదని విశ్లేషించారన్నారు. విదేశాల్లో ఉన్న రాజకీయ శాస్త్రవేత్తలు త్వరలో భారతదేశం లో ప్రజాస్వామ్యం కూలిపోతుందని చెప్పారన్నాన్నారు. అయితే ఆ రోజున భారత రాజ్యాంగం లో పొందుపరిచిన అంశాలు ఎన్నికల సంఘం  ప్రతి సందర్భంలో ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాల వలన 77 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉందన్నారు 

        తదనంతరం  జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జిల్లాస్థాయి 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన, వందేమాతరం గీతాలాపనతో  ప్రారంభించారు
       ఈ సందర్భంగా డిఆర్ఓ చంద్రశేఖర రావు మాట్లాడుతూ. జిల్లాలో 15 లక్షల 44వేల 568 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అందులో పురుషులు 7 లక్షల 47వేల 659 మంది ఉండగా స్త్రీ ఓటర్లు 7 లక్షల 96 వేల 860 మంది ఉన్నారన్నారు. మరో 49 మంది ట్రాన్స్ జెండర్ లు ఉన్నారన్నారు. మన దేశంలో  యువత ఎక్కువగా ఉందన్నారు. వారు తక్కువగా పేర్లను నమోదు చేసుకుంటున్నారన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. మన దేశంలో ఉన్న పారదర్శక ఎన్నికల విధానం మరే దేశంలోనూ లేదన్నారు. ప్రతినెల జిల్లా కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి సలహాలు సూచనలు తీసుకొని  పటిష్టమైన ఓటర్ల జాబితా తయారీకి కృషి చేస్తున్నారన్నారు

         రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీర వెంకట గురుమూర్తి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పునాది లాంటిదని, దేశానికి పునాది పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడగలుగుతుందన్నారు. ఓటు హక్కు భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా కల్పించిన వజ్రాయుధం అని, మంచి ప్రభుత్వాలు రావడానికి ఆలోచించి ఓటు వేయాలన్నారు. చాలామంది ఓటు వేయడానికి రాకుండా కొన్ని పనులు,  వ్యాపారం,  వ్యవసాయం ఉన్నాయంటూ ఒక గంట కూడా  కేటాయించలేకపోతున్నారన్నారు.
గతంలో ముఖ్య ఎన్నికల కమిషనర్ టిఎన్ స్టేషన్ ఉన్నప్పుడు ఎన్నికల నిర్వహణలో అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు.

       తదుపరి వయోవృద్ధులైన ఓటర్లను శాలువలు, పూలమాలతో ఘనంగా అతిధులు సత్కరించారు.  కొత్తగా ఓటర్లుగా నమోదైన యువకులకు  ఓటరు గుర్తింపు కార్డులు అందజేశారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో విశేషంగా ప్రతిభ కనబరిచిన అధికారులు,  సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.

      ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, మచిలీపట్నం ఇన్చార్జ్ ఆర్డిఓ పోతురాజు, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, ఎస్సీ  సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, బీసీ సంక్షేమ అధికారి రమేష్, డీఈవో సుబ్బారావు, రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి  శంకర్నాథ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాజీ మున్సిపల్ చైర్మన్ సిలార్ దాదా, అబ్దుల్ మథీన్, కొడాలి శర్మ,  పంతం వెంకట గజేంద్ర రావు, తదితర అధికారులు వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ఎన్సిసి క్యాడేట్లు వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...