Skip to main content

2026లో కృష్ణా జిల్లా మరింత అభివృద్ధి సాధించాలి



జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు

మచిలీపట్నం :

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, 2026లో ఆయన నాయకత్వంలో కృష్ణా జిల్లా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.
గురువారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు నగరంలోని జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయానికి విచ్చేసి కలెక్టర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థులకు ఉపయోగపడే చిన్న సైజు బల్లలను పెద్ద మొత్తంలో అందించారు.
జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు, కె.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ హౌసింగ్ పీడీ పోతురాజు, బందరు, గుడివాడ, ఉయ్యూరు ఆర్డిఓలు కే స్వాతి, జి బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్, డిఆర్డిఏ, మెప్మా, ఐసిడిఎస్ పిడిలు హరిహరనాథ్, సాయిబాబు, ఎం.ఎన్ రాణి, కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి కూన రాంజీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష, కలెక్టరేట్ ఏవో రాధిక, డిపిఓ జే అరుణ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్ధక శాఖల అధికారులు జె జ్యోతి, నాగరాజా, చిన్న నరసింహులు, సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతులు, వయోవృద్ధులు విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖల అధికారులు షేక్ షాహిద్ బాబు, ఫణి ధూర్జటి, జి రమేష్, కామరాజు, డిఇఓ యు వి సుబ్బారావు, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, డీఎస్ఓ జీ మోహన్ రావు, అగ్నిమాపక శాఖ అధికారి ఏసురత్నం, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు, పర్యాటక శాఖ జిల్లా మేనేజర్ రామ్ లక్ష్మణరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వెంకటేశ్వర్ ప్రసాద్, మచిలీపట్నం, తాడిగడప మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, నజీర్, పలువురు తహసీల్దారులు తదితర అధికారులు జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్
గురువారం జడ్జి  బంగ్లా నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...