Skip to main content

LA ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు వైజ్ఞానిక ప్రదర్శన

మచిలీపట్నం:

    జిల్లా స్థాయి రాష్ట్ర బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు జాతీయ గణిత దినోత్సవం వేడుకలు LA ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు నాయకత్వంలో విజయవంతంగా ప్రారంభమయ్యాయి.

      ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి దుర్గా ప్రసాద్, DCEB సెక్రటరీ విజయ్, గరికపాటి గోపీచందు, LA ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి లక్ష్మీ,  LA ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. శ్రీరామ పాల్గొన్నారు.

      ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి  యు.వి. సుబ్బారావు  ప్రసంగిస్తూ విద్యార్థుల జీవితంలో వైజ్ఞానిక దృక్పథం మరియు గణిత విజ్ఞానం అత్యంత కీలకమని తెలిపారు. శాస్త్రీయ ఆలోచన విద్యార్థుల్లో తార్కిక శక్తిని, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక విజ్ఞానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థులలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం మరియు పరిశోధనా ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అలాగే ప్రపంచ స్థాయిలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలలో సీఈఓలుగా పనిచేస్తున్న భారతీయులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలంటూ విద్యార్థులను ప్రోత్సహించారు.

       ఈ ప్రదర్శనలో పాఠశాలలో మొత్తం 196 వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...