Skip to main content

కలెక్టరేట్ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర



మచిలీపట్నం:

ఆరోగ్యకర జీవనం కోసం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజైనా సైకిల్ వాడి వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు.

శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి సిబ్బంది తో కలిసి సైకిల్ పై కలెక్టరేటుకు చేరుకుని అందరిలో స్ఫూర్తినింపారు

కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కార్యాలయాల సిబ్బంది తో కలిసి పాల్గొన్నారు. 
కలెక్టర్ నేతృత్వంలో అందరూ కలెక్టరేట్ లోని చెత్తాచెదారాలను, పిచ్చి మొక్కలను తొలగించి ట్రాక్టర్లకు ఎక్కించారు.

తొలుత జిల్లా కలెక్టర్ అందరిచేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోటారు వాహనాలు, యంత్రాల వినియోగంతో రాను రాను వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతింటుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

ఇందులో భాగంగానే కలెక్టరేట్లో ప్రతి శనివారం జిల్లా అధికారులు, సిబ్బంది ఎవరు కూడా మోటారు వాహనాలు వేసుకొని రాకూడదని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. కాలినడకన గాని లేదా సైకిల్ పైన గాని కార్యాలయాలకు రావాలని సూచించామన్నారు. 
ఇదేవిధంగా ప్రజలందరూ కూడా వారానికి ఒకసారి సైకిల్ ను వినియోగించి వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం నివారణకు తోడ్పడాలన్నారు. ఇది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అంతేకాకుండా కాలినడక వలన గాని సైకిల్ తొక్కడం వల్ల గాని అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. 

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, డీఈవో పివీజే రామారావు, బీసీ సంక్షేమ అధికారి రమేష్, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి యమ్.వెంకటేశ్వర ప్రసాద్, మునిసిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు, జిల్లా పర్యాటక అధికారి రామ లక్ష్మణ్, డిఎల్పిఓ రజావుల్లా, ఎస్ టి ఓ నిర్మల, పోస్ట్ మాస్టర్ చెన్నకేశవరావు, పలువురు కలెక్టరేట్ కార్యాలయాల సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...